ఓ గది మొత్తాన్ని అద్దాలతోనే నిర్మించిన యూట్యూబర్..!

ఓ గది మొత్తాన్ని అద్దాలతోనే నిర్మించిన యూట్యూబర్..!

by Anudeep

Ads

యూట్యూబర్ లు తమ ఫాలోవర్ల కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అందులో భాగం గానే ఓ యూట్యూబర్ ఇంటిలో తన గది మొత్తాన్ని అద్దాలతో నింపేసాడు. మాములుగా ఇంట్లో ఒక అడ్డం ఉంటె..మనం వెళ్లి మన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉంటాము. అదే గదికి పైకప్పు, నేల, గోడలు అన్ని అద్దం తోనే నిర్మించబడి ఉంటె..? ఊహించుకుంటేనే అద్భుతం అనిపిస్తోంది కదా.. ఎన్నో ప్రతిబింబాలు మనం చూడవచ్చు.

Video Advertisement

miror room 1

అయినా ఇది మనకి కొత్తేమి కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని పలు హిందూ దేవాలయాల్లో అద్దాల మంటపాలు ఉంటాయి. వీటిలో ఒక గది మొత్తాన్ని అద్దాలతోనే నిర్మించి మధ్యలో ఉయ్యాల వేసి ఉంచి ఆ దేవాలయాల దేవతలా ఉత్సవమూర్తులను ఉంచుతారు. దేవాలయం లో దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు ఈ మంటపాన్ని కూడా దర్శిస్తారు. ఆప్టికల్ ఇల్ల్యూషన్ వలన అన్ని అద్దాలలోను ఈ ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. దీనిని ప్రసిద్ధ సైన్స్ ఛానల్ ది యాక్షన్ ల్యాబ్ కు చెందిన యూట్యూబర్ ప్రాక్టికల్ గా ప్రయత్నించి చూసాడు.

mirror room 2

గతం లో కూడా అతను ఇలాంటి ప్రయోగాలనే చేసాడు. గతం లో కూడా తన ఇంట్లో అత్యంత ఎక్కువ ప్రకాశవంతమైన గదిని నిర్మించి అందరిని ఆశ్చర్యపరిచాడు. తాజాగా అద్దాల తో గదిని నిర్మించి వీడియో రూపం లో యు ట్యూబ్ లో పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో లో లాంటి గదిని నిర్మించడానికి గులకరాళ్లు లేకుండా, సాఫ్ట్ గా నేల ఉన్న గది అవసరం అని అతను తెలిపాడు. గాజులు చాలా డెలికేట్ గా ఉండి.. పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి.. ఈ గదిని నిర్మించే సమయం లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించాడు.

mirror room 3

కట్టడం పూర్తి అయిపోయాక లైట్ వేసి చుస్తే.. పైన రూఫ్, కింద ఫ్లోర్ ను చూసినప్పుడు ఎదో వంద అంతస్తుల పైనుంచి చూస్తున్న బ్రాంతి కలుగుతుంది. అది ఒక అనిర్వచనీయమైన ఫీలింగ్. అలాగే.. ఇలాంటి గదిలో కాంతి ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అన్న విషయాన్నీ కూడా అతను తెలుసుకోవాలనుకున్నాడు. కాంతి స్విచ్ ఆపివేయబడిన తర్వాత కూడా ఒక అద్దం మరొకటి నుండి ప్రతిబింబం నుండి బౌన్స్ అవుతుంది, కాబట్టి సాధారణ గదిలోకంటే ఇలాంటి గదిలో కాంతి స్లో గా ప్రయాణిస్తున్నట్లు ఉంటుంది.


End of Article

You may also like