Ads
మనుషులెవరైనా సాధారణం గా కోరుకునేది ఆరోగ్యం, ఐశ్వర్యం. ఈరోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఐశ్వర్యం ఉండాల్సిందే. ఆర్ధిక పరమైన ఇబ్బందులు మనిషిని శారీరకంగానూ, మానసికంగానూ కృంగదీస్తాయి. అందుకే ఫైనాన్షియల్ గా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని కోరుకుంటాం. డబ్బు కంటే విలువలు ముఖ్యమైనవే అయినప్పటికీ.. అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడే డబ్బు విలువ తెలిసొస్తుంది.అందుకే అందరు అలాంటి ఇబ్బందులు రాకూడదని కోరుకుంటారు. లక్ష్మి కటాక్షం ఉన్న వారి చెంత డబ్బు నిలుస్తుంది. ఇలా డబ్బు నిలవాలంటే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సి ఉంటుంది.
Video Advertisement
“‘ఆశ్వయుజ పౌర్ణమి” రోజున లక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన “కోజాగరీ వ్రతం” ను ఆచరిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుందట. ఆ రోజున అమ్మవారి వ్రతం చేసుకుని, ఆమె ను ధ్యానించి ఆ రాత్రి అంతా జాగరణ లో , అమ్మవారి ధ్యానం లో గడపాలట. ఆరోజున అర్ధరాత్రి సమయం లో గగన వీధిలో పర్యటించే అమ్మవారు తనను ధ్యానిస్తున్న వారిని అనుగ్రహిస్తుంది. అమ్మవారి అనుగ్రహం కావాలనుకుంటే ఈ వ్రతాన్ని ఆచరించండి.
End of Article