బీర్ బాటిల్స్ గ్రీన్ లేదా బ్రౌన్ రంగులోనే ఎందుకు ఉంటాయి.? వాటర్ బాటిల్ లాగా ట్రాన్స్పరెంట్ ఎందుకు ఉండవు.?

బీర్ బాటిల్స్ గ్రీన్ లేదా బ్రౌన్ రంగులోనే ఎందుకు ఉంటాయి.? వాటర్ బాటిల్ లాగా ట్రాన్స్పరెంట్ ఎందుకు ఉండవు.?

by Anudeep

Ads

మనం చూస్తూనే ఉంటాం కదా.. బీర్ బాటిల్స్ ఎక్కువ గా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి.. లేదంటే బ్రౌన్ కలర్ లోనే ఉంటాయి. అవి ఇతర మందు సీసాల లాగా తెల్లగా ఎందుకు ఉండవు..? అని మీకెప్పుడైనా అనిపించిందా..? దీనికి కూడా ఓ కారణం ఉందండోయ్. అదేంటో మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..

Video Advertisement

beer bottles 1

బీర్ ను తయారు చేసిన కొత్తల్లో ట్రాన్స్పరెంట్ బాటిల్స్ లోనే బీర్ ని అమ్మేవారట. చాలా కాలం పాటు ఇలానే అమ్మకాలు సాగిన తరువాత బీర్ తయారీదారులు తాము తయారు చేసిన బీర్ కి… అమ్మబడుతున్న బీర్ లోను తేడా ఉండడాన్ని గమనించారట. బయట దొరుకుతున్న బీర్ లో ఒక రకమైన వాసన వస్తుండడాన్ని గుర్తించారు. దీనికి కల కారణమేంటని వారు ఆలోచించగా, ట్రాన్స్పరెంట్ బాటిల్స్ ను ఉపయోగించడమేనని అర్ధమైంది.

beer bottles 2

బీర్ ని ట్రాన్స్పరెంట్ బాటిల్ లో అమ్మడం వలన సూర్య కిరణాలూ తగిలి బీర్ లో మార్పులు జరుగుతున్నాయి. సూర్య కిరణాలలోని యూవీ రేస్ బీర్ లోని ఆసిడ్ తో రియాక్ట్ అయి.. బీర్ టేస్ట్ ని మార్చేస్తున్నాయి. అంతే కాదు.. ఆ బీర్ కూడా భయంకరమైన వాసన వేసేది గా ఉండేదిట. అందుకే ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి బీర్ ను అమ్మడానికి కలర్ బాటిల్స్ ను వినియోగిస్తున్నారట. అప్పటి నుంచి ఆకుపచ్చ లేదా, బ్రౌన్ కలర్ బాటిల్స్ లో బీర్ ను స్టోర్ చేసి శీతల పరిస్థితులలో రవాణా చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారట.

beer bottles 3

రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తరువాత బ్రౌన్ కలర్ బాటిల్స్ లభ్యత తక్కువైందట. ఈ క్రమం లో గ్రీన్ కలర్ బాటిల్స్ లోనే మద్యం అమ్మకాలు సాగిస్తున్నారట. ఈ బాటిల్స్ లో కూడా అత్యంత అధునాతనమైన వాటిని వినియోగిస్తున్నారట. ఇవి ఎక్కువ ఖరీదు కలిగి ఉంటాయి.

NOTE: smoking and drinking is injurious to health. (పొగత్రాడగం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం)


End of Article

You may also like