Ads
ఈ మోడరన్ యుగం లో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా జుట్టు తో సమస్యలు ఎదురవుతున్నాయి. గతం తో పోలిస్తే, ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ లో చాలా మార్పులు వచ్చాయి. మనం తినే ఆహరం లో కల్తీ పాళ్ళు ఎక్కువ గా ఉంటోంది. దాని వలన, మనలో ఉండే హార్మోన్స్ బాలన్స్ సక్రమం గా ఉండడం లేదు. దానికి తోడు స్ట్రెస్, టెన్షన్, కాలుష్యం వంటి కారణాల ప్రభావం జుట్టు పై ఎక్కువ గా పడుతోంది.
Video Advertisement
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో జుట్టుని కేర్ చేయడం కూడా కుదరడం లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన కూడా జుట్టు రఫ్ గా తయారై ఊడిపోవడం జరుగుతోంది. ఫలితం గా తలపై చాలా చోట్ల జుట్టు పలచపడిపోయి బాల్డ్ గా కనిపిస్తోంది. చాలా మంది అబ్బాయిలు బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు. సాధారణం గా బట్టతల కలిగిన వారికీ జుట్టు పలచబడడం లేదా పూర్తి గా లేకపోవడం జరుగుతుంటుంది. ఈ స్థితి ని అలోపిషియా అంటుంటారు. ఈ వ్యాధి ఉంటె జుట్టు పూర్తిగా ఊడిపోతుంది.
ఇలాంటి స్థితి ఉన్న వ్యక్తుల్లో తలస్నానం చేసినప్పుడు కూడా హెచ్చు సంఖ్యలో వెంట్రుకలు ఊడిపోతుంటాయి. బట్టతలకు ముఖ్యమైన కారణం ఏంటంటే హెయిర్ ఫాలిసెల్స్ మూసుకుపోవడం. దీనివల్ల హెయిర్ మరింత ఎక్కువ గా ఊడిపోతుంది.
ఐరన్ మరియు ప్రోటీన్ లోపాలు, జెనెటికల్ గా ని, హార్మోన్స్ లో మార్పులు జరగడం, వయసు పెరగడం, అధికమొత్తం లో విటమిన్ ఏ తీసుకోవడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, డ్రగ్స్ తీసుకోవడం, తలలో ఏవైనా ఇన్ఫెక్షన్స్ రావడం, డైట్ లో మార్పులు చేసుకోవడం, ఎక్కువ మెడిసిన్ వాడాల్సి రావడం వంటి కారణాల వలన బట్టతల వచ్చే అవకాశం ఉంది. అలాగే, అమ్మాయిలలో జుట్టు రాలడానికి థైరాయిడ్, మెనోపాజ్, స్ట్రెస్ వంటివి కూడా కారణం కావచ్చు.
బట్టతల వచ్చే ముందు కొన్ని ముందస్తు సూచనలు కనిపిస్తుంటాయి. ఎక్కువ గా జుట్టు రాలిపోతుంటుంది. దీనివల్ల తలపై అక్కడక్కడా పాచెస్ కనిపిస్తుంటాయి. అలానే, కొన్ని చోట్ల బాల్డ్ గా కనిపిస్తుంటుంది. తలపై గుండ్రటి పాచెస్ కనిపించిన, ఎక్కువ గా ఊడిపోతోందని అనిపించినా, నెయిల్స్ లో తేడా కనిపించిన, మీకు స్ట్రెస్ ఎక్కువ అవుతోందనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
End of Article