Ads
మనం సక్సెస్ ఫుల్ గా ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. ఎప్పుడు బిజీ గా ఉండాలని, రకరకాల పనులను సమర్ధవంతం గా నిర్వర్తించుకోవాలని అనుకుంటూ ఉంటాం. కానీ, సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్ అవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అలవాట్లు. ఇక్కడ కొన్ని సక్సెస్ కాని వ్యక్తుల అలవాట్లను చెబుతున్నాం. వీటిని ఎందుకు తెలుసుకోవాలి అంటే.. ఒకవేళ అలాంటి అలవాట్లు ఏమైనా మనకి ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. తద్వారా అలాంటి అలవాట్లకు మనం దూరంగా ఉంటే.. సక్సెస్ కి దగ్గరవ్వచ్చు. ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు చూసేయండి మరి..
Video Advertisement
#1 అందరితో మంచిగా ఉండకపోవడం. ఈరోజుల్లో అందరు మంచి గా ఉన్నవాళ్ళని చేతగాని వాళ్ళ కింద జమకాడుతున్నారని మనం కూడా అలా ఉండడం కరెక్ట్ కాదు. ఎవరితోనూ ఏ గొడవలు లేకుండా ఉంటేనే మన పని మనం సక్రమం గా చేసుకోగలుగుతాం. అప్పుడే కదా మనల్ని విజయం వరించేది.
#2 అస్సలు వినకపోవడం.. మనలో చాలామంది చెప్పేది వినిపించుకోకుండా మొండి గా వాదించే వారు ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా నేనే చేసేది చేస్తా అన్నట్లు ఉంటారు. ఈ ధోరణి కూడా విజయానికి అడ్డుపడుతూ ఉంటుంది. మంచి వక్త అవ్వాలంటే ముందు మంచి శ్రోత అవ్వాలి అన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి.
#3 ఎక్కువ గా ద్వేషించడం: సాధారణం గా ఎవరినైనా సక్సెస్ అయిన వారిని చూసినప్పుడల్లా మనం ఇన్స్ పైర్ అవుతూ ఉంటాం. కాని, కొందరు మనం ఎందుకు అలా లేము అంటూ అసూయ చెందుతారు. ఇది ఎంత వరకు వెళ్తుంది అంటే.. చివరకు వారిని ద్వేషించడం తో మొదలు పెట్టి.. అందరిని ద్వేషించుకుంటూపోతారు. ప్రేరణ రావడానికి, అసూయ రావడానికి చాలా తేడా ఉంటుంది. ఈ అసూయ తో వారు ఆటిట్యూడ్ చూపిస్తూ.. చుట్టూ ఉండే వారికి మరింత దూరం అవుతూ ఉంటారు.
#4 చేతలకన్నా మాటలెక్కువ చెప్పడం: చాలా మంది చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ అన్నట్లు ఉంటారు. మాటల్లో కాదు చేతల్లో చూపించు అని పెద్దలు హెచ్చరించేది అందుకే. మన సక్సెస్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది తప్ప మాటల్లో కాదు.
#5 పరధ్యానం లో ఉండడం: పరధ్యానం లో ఎక్కువ సమయం అంత మంచిది కాదు. ఇది సక్సెస్ ని దూరం చేస్తోంది. ఏదేదో జరిగిపోతోంది అనుకుంటూ తమలో తామే ఊహించుకుంటూ.. చేయాల్సిన పనిని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇలాంటి వారు తమ పని ని సకాలం లో పూర్తి చేయలేరు.
#6 నెగటివ్ స్నేహితులు ఉండడం: ఒక మనిషి క్యారెక్టర్ ను అతని ఫ్రెండ్స్ ని బట్టి తెలుస్తుందంటారు. మన చుట్టూ చెడ్డ స్నేహితులు, నెగటివ్ భావజాలం ఉన్నవారు ఉంటే మనం కూడా అదే నిరాశాజనకం గా బతికేస్తూ ఉంటాం. మనలని విజయం వైపు సాగకుండా వీరు నెగటివ్ భావజాలాన్ని మనపై రుద్దుతుంటారు.
#7 పనిని వాయిదా వేయడం: ఇప్పుడే ఏమి చేస్తాం లే.. కాసేపాగి చేద్దాం అని మనకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది కదా. కాని, ఇలా పనులను అస్తమానం వాయిదా వేసేవారు విజయాన్ని చేరలేరు.
#8 బద్దకస్తులు: అప్పుడప్పుడు ఏదైనా పని చేయబుద్ధికాకపోవడం వేరు.. అదేపనిగా పనులు చేయడానికి బద్ధకించడం వేరు. ఒక పనిని మనం పదే పదే వాయిదా వేస్తున్నామంటే బద్ధకిస్తున్నామని అర్ధం. ఎప్పటి పనులు అప్పుడు చేయకుండా ఇలా వాయిదా వేసేవారు కూడా సక్సెస్ కి దూరం గా బతుకుతుంటారు.
#9 నేర్చుకోవడానికి ఆసక్తి చూపకపోవడం: విజయం కావాలనుకునే వారెప్పుడు నిత్య విద్యార్థి గా ఉండాలి. నిరంతరం ఎదో ఒక విషయం గురించి నేర్చుకుంటూ..చురుకు గా ఉండాలి. అలా కాకుండా నిర్లిప్తం గా నాకంతా తెలుసు అన్న భావాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే విజయం లభించదు.
#10 పని మధ్యలో వదిలేయడం: ఏదైనా పని మొదలు పెడితే, దానిని పూర్తి అయ్యేవరకు చేయాలి. మధ్యలో విరామం వచ్చినా, పనిని మాత్రం వదిలేయకూడదు. మధ్యలో పనిని వదిలేసేవాళ్ళతో కూడా దూరం గా ఉండడం మంచిది. ఈ అలవాటు విజయానికి తొలి అడ్డంకి. పనిని వదిలేయడం వలన మనం ఫెయిల్ అవలేదు కదా అని అనుకోవడానికంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఇలా పని మధ్యలో వదిలేసేవారు ఎన్నటికీ విజయపు అంచులకు చేరుకోలేరు.
End of Article