Ads
సంప్రదాయాలు, ఆచారాలు కేవలం భారత్ లో నే కాదు. పలు ఇతర దేశాల్లో కూడా వారి వారి పరిస్థితులకు అనుగుణం గా సంప్రదాయాలు రూపొందించబడ్డాయి. అయితే, ఆరోగ్యకరమైన సంప్రదాయాలను మాత్రం మనం భారత్ లోనే చూస్తాం. భారత్ లో కొన్ని వింత వింత సంప్రదాయాలు ఉన్నప్పటికీ, ఇతర దేశాలతో పోలిస్తే ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేవి తక్కువ. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే.. ఇండోనేషియా లో ఓ వింత సంప్రదాయం ఉంది. అసలు ఈ సంప్రదాయం ఎందుకు వచ్చిందో..అదేంటో చూద్దాం రండి.
Video Advertisement
ఏ దేశం లో అయినా.. కొత్త గా పెళ్లి చేసుకున్న జంట గుడికో, హనీమూన్ కో వెళ్లడం కామనే. కానీ, ఇండోనేషియా లో మాత్రం కొత్త గా పెళ్లి చేసుకున్న జంటను మూడు రోజుల పాటు హౌస్ అరెస్ట్ చేసేస్తారు. వారిద్దరిని ఒకే గదిలో పగలు, రాత్రి వదిలేస్తారు. అంతే కాదు, ఆ మూడు రోజుల పాటు వారు టాయిలెట్ కి కూడా వెళ్లకూడదట. మూడు పగళ్లు, మూడు రాత్రుళ్ళు పూర్తి అయ్యేవరకు వారిని గదినుంచి బయటకు రానివ్వరట. గదికి బయట తాళం వేసి వారి కదలికలపై నిఘా వేసి ఉంచుతారట.
ఎన్నో తరాల నుంచి ఇండోనేషియన్లు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. తమ పిల్లలు కూడా ఈ సంప్రదాయాన్ని చెడగొట్టకుండా ఉండడం కోసమే వారిని గదిలో బంధిస్తారట. ఇలా చేయడం వలన వారికి ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారని, వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో గడుస్తుందని ఇండోనేషియన్లు నమ్ముతారట. అందుకే, కొత్త గా పెళ్లి చేసుకున్న జంట ను గదిలో బంధించి, వారికి చాలా తక్కువ ఆహారాన్ని, నీటిని అందిస్తారు. బాత్ రూమ్ కి కూడా వెళ్లనివ్వరు. చిత్రమైన ఆచారం కదా…
End of Article