టీ, కాఫీ తాగాక మంచినీళ్లు తాగితే పళ్ళు ఊడిపోతాయా..? దీనిపై నిపుణులు ఏమి చెబుతున్నారు..?

టీ, కాఫీ తాగాక మంచినీళ్లు తాగితే పళ్ళు ఊడిపోతాయా..? దీనిపై నిపుణులు ఏమి చెబుతున్నారు..?

by Anudeep

Ads

ఉదయాన్నే లేవగానే మనకి టీ/కాఫీ తాగకపోతే తెల్లారదు. ఏ పని చేయాలనిపించదు. అలసట గా ఉన్నపుడు.. నీరసం గా ఉన్నపుడు కూడా ఒక కప్ టీ లేదా కాఫీ తాగితే.. మనకి చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అయితే, చాల మంది కాఫీ లేదా టీ తాగేముందు మంచినీటిని తాగుతారు. కానీ టీ లేదా కాఫీ తాగిన తరువాత ఏమి తాగరు. మరికొందరైతే అసలు టీ, కాఫీ తాగాక మంచినీళ్లు తాగకూడదని చెబుతుంటారు. అసలు ముందు తాగాలా…? తరువాత తాగాలా..? తర్వాత ఎందుకు తాగొద్దని చెబుతున్నారో.. మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

cofee tea

చాలా మంది టీ లేదా కాఫీ తాగాక నీళ్లు తాగితే పళ్ళు ఊడిపోతాయని చెబుతుంటారు. నిజానికి మనం టీ, కాఫీ వేడి వేడి గా తాగుతాం. ఆ తరువాత వెంటనే చల్లగా ఉండే నీళ్లు తాగడం వలన దంతాలు కదిలి..ఊడిపోతాయని చెబుతుంటారు. అయితే.. నిపుణులు మాత్రం దీనిపై మీకు ఎలాంటి అపోహలు అవసరం లేదంటున్నారు. టీ లేదా కొద్దీ సేపటికి మీరు నీరు తాగచ్చు.. లేదా నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించవచ్చు. ఇలా చేయడం వలన మీ పళ్ళు గారపట్టవు. టీ, కాఫీ లలో కెఫీన్ అనే పదార్ధం ఉంటుందన్న సంగతి తెలిసిందే.

cofee tea 1

ఇది మీ పళ్లకు గార పట్టిస్తుంది. ఈ కెఫీన్ అనే పదార్ధం అల్జీమర్స్, గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది.ఈ పదార్ధం వల్లనే, మనం టీ, లేదా కాఫీ తాగగానే ఉత్తేజం పొందుతాము. కానీ, ఎక్కువ మొత్తం లో టీ / కాఫీ లు తీసుకోవడం వలన, మన శరీరం లో కెఫీన్ ఎక్కువై కాలేయ సంబంధిత సమస్యలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే టీ, కాఫీలను పరిమితం గా తీసుకోవాలి. అలాగే, వేడి వేడి గా టీ, కాఫీ లు తాగడం వలన ఏరో డైజస్టివ్ సిస్టమ్‌ పై ఉండే పొర దెబ్బతింటుంది. అందుకే ముందుగా కొంత మంచినీటిని తాగడం వలన ఈ పొర వేడిని తట్టుకోగలుగుతుంది.

woman with tea

అలాగే, టీ / కాఫీలు అసిడిటీ ని కలిగిస్తాయి. కాలేయ సంబంధిత వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే మీరు కాఫీ లేదా టీ తాగేముందు మంచినీటిని తాగితే.. ఈ ఇబందులను అరికట్టవచ్చు. టీ లో కెఫీన్ తో పాటు ధియామిన్‌ అనే రసాయనం కూడా ఉంటుంది. అందుకే, టీ / కాఫీ లను ఎక్కువ మొత్తం లో తాగడం వలన ఇబ్బందులను ఎదుర్కోవాలి. అదే ముందు కొంత మంచినీటిని తాగడం వలన ఈ ఇబ్బందులని ఎదుర్కోవచ్చు.


End of Article

You may also like