Ads
మనం రోడ్డు పై వెళ్తున్నపుడు రోడ్ సైడ్ గాని, పండ్ల మార్కెట్ లలో గాని బాక్సుల్లో పండ్లని పెట్టి అమ్ముతుంటారు కదా.. అయితే, ఈ పండ్లపై స్టిక్కర్లు అతికించి ఉంటాయి. అసలు ఈ స్టిక్కర్లు ఎందుకు అతికిస్తారు. ఈ స్టిక్కర్లను అతికించడం లోని ఉద్దేశ్యం ఏమిటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
సామాన్యం గా పండ్లపై ఇలాంటి స్టిక్కర్లు ఉంటె.. వాటిని మనం చూడగానే అవి సహజం గానే పండించారా? లేక రసాయనాలను ఉపయోగించి పండించారా? అన్న విషయాన్నీ మనం చూడగానే చెప్పేయొచ్చు. ఈరోజుల్లో పండ్లన్నీ రసాయనాలతోనే పండిస్తున్నారు. ఆర్గానిక్ గా దొరికేది చాలా తక్కువ. ఒకవేళ దొరికినా వీటిని చాలా కాస్ట్ లీ రేటుకి అమ్ముతున్నారు. అంత చేసిన.. అవి ఆర్గానిక్ ఏ నా కాదా? అన్న సంగతి మనం చెప్పలేము.
అదే ఇలాంటి స్టిక్కర్లు ఉన్న పండ్లు అయితే.. మనం ఈజీ గా గుర్తించవచ్చు. అదెలానో చూడండి. పండు పై ఉన్న స్టిక్కర్ పై మూడు లేదా నాలుగు అంకె ఉంటె..ఆ పండ్లని కృత్రిమ రసాయనాలు, సహజ ఎరువులు వాడి పండించారని అర్ధం. అదే 9 నెంబర్ ఉంటె దానిని సేంద్రియ ఎరువులు ఉపయోగించి సహజసిద్ధం గా పండించారని అర్ధం. అలా కాకుండా, 8 అంకెతో ఉంటె మాత్రం వాటిని జన్యు మార్పిడి పధ్ధతి ద్వారా పండించారని అర్ధం. ఇవి తింటే చాలా ప్రమాదకరం. అందుకే పండ్లను తీసుకునే ముందు జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఈ సమాచారం మీరు తెలుసుకుని.. మీ స్నేహితులతో కూడా పంచుకోండి.
End of Article