విమానం లో వెళ్తున్నపుడు అనుకోకుండా కిటికీ అద్దాలు పగిలిపోతాయా..?మీకెప్పుడైనా ఇలాంటి డౌట్ వచ్చిందా..?

విమానం లో వెళ్తున్నపుడు అనుకోకుండా కిటికీ అద్దాలు పగిలిపోతాయా..?మీకెప్పుడైనా ఇలాంటి డౌట్ వచ్చిందా..?

by Anudeep

Ads

మనకి కొన్ని కొన్ని సార్లు వింత వింత డౌట్ లు వస్తూ ఉంటాయి కదా.. ఉన్నట్లుండి మనం ఉన్న రూమ్ లో ఫ్యాన్ ఊడి కింద పడితే ఏమవుతుంది..? అని సడన్ గా ఆలోచిస్తూ ఉంటాం. ఇది కూడా అలాంటి డౌటే. మనం విమానం లో వెళ్తున్నపుడు అనుకోకుండా కిటికీ అద్దాలు పగిలిపోతాయా..? అని మీకెప్పుడైనా అనిపించిందా..? సహజం గా ఇలాంటి ప్రశ్నలు చిన్నపిల్లలకే ఎక్కువ వస్తుంటాయి.. ఎక్కువ గా ఆలోచించగలిగే సామర్ధ్యం ఉన్న వారికి కూడా ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయట.

Video Advertisement

aeroplane windows

విమానం లో మనకి కలిగే అనేక సందేహాలకు సమాధానం గా రాకేష్‌ ధన్నారపు అనే హైదరాబాద్ యువకుడు ‘101 ఫ్లైయింగ్ సీక్రెట్స్’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం లో ఆయన పలు ప్రశ్నలకు పూర్తి వివరణ తో సమాధానం ఇచ్చారు. ఆస్ట్రేలియాలోని రాయల్‌ మెల్‌బోర్న్‌ ఇన్‌స్టిట్యూట్ లో చదువుకున్న రాకేష్‌ ఈ ప్రశ్నకి విశ్లేషణాత్మకం గా సమాధానం ఇచ్చారు. సాధారణం గా విమానపు కిటికీలు గ్లాస్ లాగ కనిపిస్తాయి కదా. అవి విమానం అంత పైకి ఎగురుతున్నపుడు పగిలిపోతాయేమో అన్న సందేహాలు రావడం సహజం.

aeroplane windows 2

అయితే, విమానం లోపలి ఎక్కేటప్పుడు ఎవరిని లోహపు వస్తువులు, కత్తులు, నెయిల్‌కట్టర్లు వంటివాటిని లోపలకి తీసుకు రావడానికి అనుమతించరు. ఎంత బలం గా ఉన్న వ్యక్తి అయినా సరే.. ఉద్దేశపూర్వకం గా గ్లాస్ డోర్ లపై బద్దలు కొట్టినా అవి పగలవు. విమానం లో ఏర్పాటు చేసే కిటికీలను పాలీ కార్బొనేట్‌తో తయారు చేస్తారు. ఈ కిటికీలు ఎంత ఒత్తిడి ని అయినా తట్టుకోగలవు. విమానాలు భూమి కి పైన, ఎత్తున ఎగురుతూ ఉంటాయి. ఈ క్రమం లో బలమైన గాలి వలన చాలా ఒత్తిడి ఉంటుంది. పాలీ కార్బొనేట్‌తో చేయబడ్డ ఈ కిటికీలు ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడగలవు. అందుకే విమానం లో ఏర్పాటు చేసే కిటికీలు పగలడానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. కాబట్టి భయపడాల్సిన పని లేదు.

Note: images used in this article are only for representative purpose. But not the actual characters


End of Article

You may also like