Ads
ఆధునీకరణ పెరుగుతూ వస్తున్న కాలం లో విమాన ప్రయాణాలు మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమం లో విమానాల గురించి కూడా మనం పూర్తి అవగాహన పెంచుకోవడం అవసరం. చాలా మందికి విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయం లోను, తిరిగి ల్యాండ్ అవుతున్న సమయం లోను ఒకరకమైన భయం ఉంటుంది.
Video Advertisement
ఎందుకంటే.. విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయం లోను, ల్యాండ్ అవుతున్న సమయం లోను కొంత సేపటివరకు రన్ వే మీద టైర్లతో నడుస్తుంటుంది. సాధారణం గా కార్లపై వెళ్లే వేగం కంటే.. ఈ వేగం ఎక్కువ గా ఉంటుంది. ఇలాంటి టైం లో టైర్లపై ఎక్కువ ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. అంత వేగం తో వెళ్తున్న సమయం లో ఎక్కువ ఒత్తిడి కారణం గా టైర్లు పేలిపోతే..? అన్న అనుమానం మనలో భయం కలగడానికి కారణం అవుతుంది.
సాధారణం గా విమానం ల్యాండ్ అవుతున్న సమయం లో గంటకు 330 కిలోమీటర్ల వేగంతో ల్యాండ్ అవుతాయి. పైగా విమానం లో 500 మందికి పైగానే మనుషులు ఉంటారు. ఈ క్రమం లో అంత ఒత్తిడిని తట్టుకుంటూ.. రన్ వే పై విమానాన్ని నిలపగలిగేది టైర్లే. అంత వేగం లో కూడా దెబ్బ తినని టైర్లను వినియోగిస్తారు. అయితే.. ఈ రాపిడికి చాలా సార్లు రన్‌వే పైన 700 గ్రాముల వరకు టైర్ కి ఉండే రబ్బర్ అతుక్కుపోతుంది.
అందుకే ఏరోప్లేన్ లు ల్యాండ్ అయ్యే రన్ వే లపై నల్లటి గీతలుంటాయి. అయితే, విమానం రెండొందల సార్లు ల్యాండ్ అయిన తరువాత ఈ టైర్లను మార్చేస్తారు. ఈ విషయం లో మాత్రం కచ్చితం గా జాగ్రత్తలు తీసుకుంటారు. కారు టైర్ మార్చినంత ఈజీ గా విమానం టైర్ ని కూడా మార్చేయచ్చు. అందుకే ప్రతి 200 ల్యాండింగ్ ల తరువాత టైర్లను మారుస్తారు.
End of Article