Ads
విమానం లో ప్రయాణం చేయడం మనందరికీ ఇష్టమే. కానీ, మనలో కూడా చాలా మందికి అనేక అనుమానాలు, అపోహలు ఉంటాయి. విమానాల గురించి పూర్తి గా తెలియకపోవడం.. కాస్ట్ ఎక్కువ ఉండడం వలన మనం ఎక్కువ గా వాటిలో ప్రయాణం చేయకపోవడం వలన దగ్గరిగా చూసే అవకాశాలు తక్కువ గా ఉండడం కూడా ఈ అపోహలకు ఓ కారణం.
Video Advertisement
అయితే, ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి రాకేష్ ధన్నారపు అనే హైదరాబాద్ యువకుడు “101 ఫ్లయింగ్ సీక్రెట్స్” అనే పుస్తకాన్ని రాసారు. ఇందులో మనం ఊహించని అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సాధారణం గా వెదర్ అనుకూలించని సమయం లో విమానాలను నడపరు. దగ్గర్లోని ఎయిర్పోర్ట్ దగ్గర ల్యాండ్ చేసేసి.. పరిస్థితి అనుకూలించిన తరువాత తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు. అయితే, లాండింగ్ అవ్వడానికంటే ముందే వర్షం పడుతున్నప్పుడు.. పిడుగులు పడే అవకాశం ఉన్నపుడు ఏమి జరుగుతుంది..?
మీకెప్పుడైనా ఇలాంటి సందేహం వచ్చిందా..? ఈ ప్రశ్న కి కూడా “101 ఫ్లయింగ్ సీక్రెట్స్” బుక్ లో సమాధానం దొరుకుతుంది. ఏడాది కి ఒక్క సారి అయినా విమానం పై పిడుగు పడే అవకాశం ఉంటుంది. చిన్న పిడుగు అయినా.. పెద్ద పిడుగు అయినా.. పిడుగు విమానం పై పడడం వలన విమానం పై నల్లగా మచ్చలు ఏర్పడతాయి. ఒక వేళ, ఈ పిడుగు కాక్పిట్ లేదా ఇంధన ట్యాంకుల పై పడితే.. అది మరింత ప్రమాదం. అందుకే, విమానంపైన ఒక రకమైన రాగి జాలీ ని వేస్తారు.
ఇది ఏమి చేస్తుందంటే.. పిడుగులు పడినప్పుడు వచ్చిన విద్యుత్ ని గ్రహించేస్తుంది. లోపలకు రానివ్వదు. అందుకే ఎలాంటి ప్రమాదం జరగదు. కానీ.. ఇది చాలా అరుదైన సందర్భాలలో జరుగుతుంది. పైలట్ లు ఎంతో చాకచక్యం గా వ్యవహరిస్తారు. వెదర్ అనుకూలించని పరిస్థితిల్లో విమానాన్ని నడపరు.
End of Article