మన రాష్ట్రపతి గుర్రపు బగ్గీని మనం పాకిస్థాన్ పై టాస్ వేసి గెల్చుకున్నామని తెలుసా..? ఆ కథ ఏంటో చూడండి..!

మన రాష్ట్రపతి గుర్రపు బగ్గీని మనం పాకిస్థాన్ పై టాస్ వేసి గెల్చుకున్నామని తెలుసా..? ఆ కథ ఏంటో చూడండి..!

by Anudeep

Ads

మన రాష్ట్రపతి ని మీరెప్పుడైనా గుర్రపు బగ్గీ పై చూసారా..? మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కూడా అదే గుర్రపు బగ్గీ పై ప్రమాణ స్వీకారానికి వచ్చారు. గతం లో ప్రతి ప్రభుత్వ సమావేశానికి గుర్రపు బగ్గీ పైనే హాజరు అయ్యే వారట. ఇంతకీ ఈ గుర్రపు బగ్గీ అసలు కథ తెలుసా..? అదేంటో చూడండి..

Video Advertisement

chariot 2

పాకిస్థాన్ గతం లో భారత్ లోనే భాగం గా ఉండేదని తెలుసుకదా. ఆ తరువాత అది భారత్ నుంచి విడిపోయింది. అయితే, అప్పటికి బ్రిటిష్ వారి ఆధ్వర్యం లోనే భారత్ కు, పాకిస్థాన్ కు జనాభా ప్రాతిపదికన కింద ఆస్తి పంపకాలు జరిగాయి. అయితే, రెండు దాయాది దేశాల మధ్య గుర్రపు బగ్గీ ఏ దేశానికీ ఇవ్వాలన్న తగాదా వచ్చింది. ఈ తగాదా ని సర్ది చెప్పే క్రమం లో పాకిస్థాన్ ఆర్మీ కి చెందిన అధికారి ష‌హ‌బ్జాదా యాకుబ్ ఖాన్‌, భార‌త లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ ఠాకూర్ గోవింద్ సింగ్ లు రూపాయి బిళ్ళతో పరిష్కారం చెప్పారు.

chariot 1

టాస్ లో ఏ దేశం గెలిస్తే, ఆ దేశానికీ ఈ బగ్గీని ఇవ్వాలనుకున్నారు. అందరి సమక్షం లోనే భారత్ బొమ్మని కోరితే, పాకిస్థాన్ బొరుసు ను కోరింది. అయితే టాస్ పై బొమ్మ పడడం తో గుర్రపు బగ్గీ భారత్ సొంతమైంది. అప్పటి నుంచి ప్రతి ప్రభుత్వ సమావేశాలకు రాష్ట్రపతి గుర్రపు బగ్గీ పైనే ప్రయాణించేవారు. కాలక్రమం లో సెక్యూరిటీ రీజన్స్ కారణం గా వీటి వాడకం తగ్గించారు. అయితే, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దీని పై రాష్ట్రపతి కార్యాలయానికి వచ్చి ప్రమాణ స్వీకారం చేసారు.

chariot 3

ఆయన తరువాత, రామ్ నాధ్ కోవింద్ కూడా అదే విధం గా గుర్రపు బగ్గీ పై వచ్చి ప్రమాణ స్వీకారం చేసారు. ప్రమాణ స్వీకారం చేసేముందు, మాజీ రాష్ట్రపతి, కొత్త గా ఎన్నుకోబడ్డ రాష్ట్రపతి ఇద్దరు కలిసి ఈ గుర్రపు బగ్గీ పై కార్యాలయానికి వస్తారు. ఆ తరువాత, ప్రమాణ స్వీకారం పూర్తి అయ్యాక వీరిద్దరూ తమ ప్లేస్ లను మార్చుకుని తిరుగు ప్రయాణం అవుతారు. ఇది ఎప్పటినుంచో భారత్ లో ఆనవాయితీగానే వస్తోంది.


End of Article

You may also like