Ads
మద్యం తాగితే నిజాలు బయటకొస్తాయన్నది బహిరంగ రహస్యమే. కొంతమంది రోజూ తాగుతారు. కొంతమంది వారానికోసారి తాగుతారు. కొంతమంది చుట్టూ పది మంది చేరినప్పుడు తాగుతుంటారు. ఏది ఏమైనా.. ఈ తాగుడు మాత్రం పూర్తిగా లేకుండా పోవడం అంటూ లేదు. కానీ, తాగుతున్నప్పుడు.. తాగిన తరువాత జరిగేదే కొన్నిసార్లు ఇబ్బందులకు గురి చేయచ్చు..మన పరువు తీయచ్చు కూడా.
Video Advertisement
కానీ, కొంతమంది మాత్రం నిజాలు చెప్పడానికి ధైర్యం కోసం తాగుతుంటారు. దీనికి కారణం ఏంటంటే.. మందు తాగగానే ఒకరకమైన ఆత్మవిశ్వాసం వచ్చేస్తుందట. తాము ఏమైనా చేయగలమని.. అన్ని తమ కోసమే జరుగుతున్నట్లు.. అన్ని తమవే అన్నట్లు ఓ రాజు లా ఫీల్ అయిపోతూ ఉంటారట. అందుకే.. ఓ పది మంది కలిసి సిట్టింగ్ వేసినపుడు మందు ఎక్కువైన వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. కొందరు బ్రేక్ అప్ ఐన వారు అయితే వారి లవ్ స్టోరీ ని గుర్తు చేసుకోవడమో లేక లవర్ ని తిట్టడం లేదా పొగడడం చేస్తూ ఉంటారు. ఇలా వారి మనసులో ఏమి ఉందొ అదే మాట్లాడతారు.
మరికొందరు ఏమో ఊరకనే ఇంగ్లీష్ లో ఇరగదీసేస్తు ఉంటారు. మాములుగా ఉన్నపుడు ఇంగ్లీష్ లో మాట్లాడమంటే తడపడేవాళ్లు కూడా రెండు పెగ్గులు పడేసరికి బాస్ లెవెల్ లో ఇంగ్లీష్ లో దంచేస్తూ ఉంటారు. దీనిపై పరిశోధనలు కూడా జరిగాయట. సైకో ఫార్మాలజి జర్నల్ ప్రకారం రెండు పెగ్గుల ఆల్కహాల్ మనలో ఉండే మొహమాటాన్ని, భయాన్ని పోగొడుతుందట. అందుకే ఆల్కహాల్ తీసుకున్న వారికి ఎక్కడ లేని ధైర్యం, తెగువ వచ్చేసి ఏది అనుకుంటే అది చేసేసారట. కానీ అతి సర్వత్రా వ్యర్జయేత్ అన్న విషయాన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఎక్కువ గా తీసుకుంటే.. ఆల్కహాల్ కూడా ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
End of Article