Ads
ఆదివాసీ తెగల్లో సాధారణం గా నే విచిత్రమైన సంప్రదాయాలు ఉంటాయి. మన సంప్రదాయాలతో పోలిస్తే.. ఇవి చాలా భిన్నం గా ఉంటాయి. గిరిజన తెగల్లో ఉండే భిన్న భిన్న తెగలకు భిన్న సంప్రదాయాలు ఉంటాయి. అలానే టోడ అనే గిరిజన తెగ కు కూడా చాలా వింత సంప్రదాయాలు ఉన్నాయి. అందులో ఒక వింత ఆచారం ఏమిటంటే.. వీరు పెళ్లి చేసుకోవాలంటే ముందు ప్రెగ్నంట్ అవ్వాలి. వింత గా అనిపిస్తోంది కదా..
Video Advertisement
వీరు తమిళనాడు లోని నీలరిగిరి అడవుల వద్ద ఉంటారు. ఊటీకి సమీపం లో ఉండే ఉదగమండలం అడవుల్లో వీరు ఉంటూ ఉంటారు. వీరు ఓ అబ్బాయికి, అమ్మాయికి పెళ్లి నిశ్చయం చేస్తే.. ఏ వేడుక, సంబరాలు లేకుండా నామ మాత్రం గా పెళ్లి చేస్తారు. ఈ నామ మాత్రపు పెళ్లి ని వారు పెళ్లి గా భావించారు. అబ్బాయిని, అమ్మాయిని ఏకాంతం గా వదిలేస్తారు. ఈ సమయం లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తో గడిపిన తరువాత పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి గర్భవతి అయితేనే.. దీనిని పెళ్లి గా జమకట్టి వేడుకలతో.. ఆమె ను అతనికి భార్య ను చేస్తారు.
ఒకవేళ, గర్భం రాకపోతే.. ఆమెను దూరం చేస్తారు. అతని వద్దకు మరో ఇద్దరు అమ్మాయిలను పంపుతారు. వారికి కూడా గర్భం రాకపోతే.. అతను ఇక జీవితాంతం పెళ్లి చేసుకోకుండా గడపాల్సిందే. పెళ్లి కూతురుకు గర్భం వచ్చిన తరువాత కూడా కొన్ని షరతులు ఉంటాయట. ఆ అమ్మాయి కి ఏడవ నెల వచ్చిన తరువాత సదరు వ్యక్తి అడవికి వెళ్లి చెట్టు కాండం తో విల్లుని, బాణాన్ని చేయాల్సి ఉంటుంది. అవి ఆ అమ్మాయికి నచ్చితేనే అతని వద్దకు భార్య గా వస్తుంది.
ఆ అమ్మాయికి నచ్చితే, ఊరంతా బాణం, విల్లు వేడుకను జరుపుతారు. ఇవి ఓ రేంజ్ లో జరుగుతాయి. ఈ వేడుకలకు విదేశీయులు కూడా హాజరు అవుతుంటారట. బయటి ప్రపంచం నాగరికత పేరుతొ దూసుకెళ్తుంటే.. వీరు మాత్రం బయటి ప్రపంచం కంటే.. తమ సంప్రదాయాలకు విలువిస్తూ బతుకుతున్నారు.
End of Article