టీ షాప్ లో నాకు ఎదురైన సంఘటన..”త్వరగా బండి తియ్యి.. పోరి మిస్ అవుతుంది” అని అనేసరికి షాక్..!

టీ షాప్ లో నాకు ఎదురైన సంఘటన..”త్వరగా బండి తియ్యి.. పోరి మిస్ అవుతుంది” అని అనేసరికి షాక్..!

by Anudeep

Ads

భారతీయుల్లో చాలా మంది యూత్ అమ్మాయిల పట్ల ప్రవర్తించే విషయం లో కొంత మెచూర్డ్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మనలో చాలా మంది యంగ్ ఏజ్ లో ఉన్న అబ్బాయిలు ఎవరైనా అమ్మాయి అందం గా కనబడగానే.. ఆమె వెంట పడడమో, ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించడమో చేస్తూ ఉంటారు. ఆ క్షణాన వారు ఎదో మాయ కమ్మేసినట్లు ప్రవర్తిస్తుంటారు.

Video Advertisement

tea stall 2

ఇది చాలా తప్పు. అలా ఎక్కడ పడితే అక్కడ ఓ అమ్మాయి పట్ల అలా ప్రవర్తించడం ఎంత క్రీపీ గా ఉంటుందో ఎపుడైనా ఆలోచించారా..? పర్వర్టెడ్ గా ప్రవర్తించడం అనేది ఈ ప్రపంచానికి మిమ్మలను మూర్ఖుల లాగా చూపిస్తుంది. చివరికి అది మీ జీవితాలను కూడా నాశనం చేస్తుంది. దీని గురించి, ఆర్యన్ కపూర్ అనే ఓ కోరా యూజర్ తన నిజ జీవితం లో చూసిన సంఘటన గురించి వివరించారు. అతను ఓ టి స్టాల్ దగ్గర కూర్చుని చాయ్ తాగుతున్నారట. ఆ సమయం లో మరో ఇద్దరు టీనేజీ కుర్రాళ్ళు టీ తాగేసి.. డబ్బులు ఇచ్చారు.

tea stall

ఆ టీ స్టాల్ వ్యక్తి చిల్లర కోసం వెతుకుతుండగా, వీరు అతన్ని బాగా తొందర పెట్టారు. త్వరగా చిల్లర ఇవ్వాలని హడావిడి చేసారు. బైక్ కూడా తొందరగా స్టార్ట్ చేయమని వారిలో ఒకరు తన స్నేహితుడికి చెప్తూ..”తొందరగా స్టార్ట్ చెయ్యి.. లేకపోతె ఈ పోరీని మిస్ అవుతాం” అంటూ చెప్తున్నాడు. అక్కడివారికి అది చూస్తుంటే.. వారిద్దరిపైనా ఒకలాంటి ఫీలింగ్ కలిగింది. ఒకమ్మాయి చూడగానే అందం గా కనబడితే, ఇలా ప్రవర్తించడం వలన సొసైటీ లో చెడు ఇంప్రెషన్ కలుగుతుంది. ఈ విషయాన్ని యువత అర్ధం చేసుకోవాలి. తల్లి తండ్రులు కూడా మొదటి నుంచి పిల్లలలో ఈ అవగాహన కలిగించాలి.

note: images used are just for representative purpose…but not the actual characters.


End of Article

You may also like