Ads
కరోనా మహమ్మారి ఎంత ఉద్ధృతం గా వ్యాప్తి చెందుతోందో గమనిస్తూనే ఉన్నాం.. అయితే.. ఈ పరిస్థితుల్లో పానిక్ అవడం కంటే.. పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి అన్న సంగతి ని ముందు ఆలోచించాలి. కరోనా సోకినప్పటికీ.. చాలా మంది ఇంట్లోనే ఉండి హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు.
Video Advertisement
చాలా మంది లో లక్షణాలు కనిపించకపోయినా.. ఆక్సిజన్ లెవెల్స్ మాత్రం కొంతమేర తగ్గుతున్నాయట. ఈ క్రమం లో ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచుకోవడానికి మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రోనింగ్ టెక్నీక్ గురించి తెలుసుకుందాం. ప్రోనింగ్ టెక్నీక్ అంటే ఏమిటంటే.. ఊపిరి సరిగ్గా ఆడక ఇబ్బంది పడుతున్న సమయం లో పక్కకు తిరిగి పడుకోవడం లేదా వాలు గా పడుకోవడం, లేదా బోర్లా పాడుకోవడమే ఈ టెక్నీక్ రహస్యం.
కరోనా సోకడం వలన శ్వాసలో ఇబ్బందులు ఎదురవుతున్న వారు ఈ పధ్ధతి పాటించడం వలన వారికి ఇబ్బందులు తొలగుతాయని వైద్యులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది ఎదురవుతున్నవారు ఎప్ప్పటికప్పుడు తమ రక్తం లో ఎంత ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆక్సిజన్ శాతం తగ్గుతున్నపుడు ప్రోనింగ్ టెక్నీక్ ను పాటించి చూడాలి. అపుడు శ్వాస ఆడుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ 94 కంటే తక్కువ ఉన్న సమయం లో కూడా ప్రోనింగ్ పధ్ధతి సాయపడుతుంది.
ఇది ఎలా చేయాలి..?
ఇందుకోసం నాలుగైదు దిండ్లు అవసరమవుతాయి. ఒకటి తలకింద, ఛాతి నుంచి, తొడల వరకు వరుసగా దిండ్లు పెట్టుకోవాలి. రెండు దిండ్లు మాత్రం మోకాళ్ళ కింద నిలువు గా ఉంచాలి. బోర్లా పడుకోవడం, ఎడమ వైపు తిరిగి పడుకోవడం, వాలుగా కూర్చోవాలి, కుడి వైపు తిరిగి పడుకోవాలి, తిరిగి బోర్లా పడుకోవాలి. అయితే కంటిన్యూ గా ఒకే పొజిషన్ లో ఉండకూడదు. ముప్పై నిమిషాల కు ఒకసారి పొజిషన్ ను మారుస్తూ ఉండాలి.
ఎవరు చేయకూడదు?
గర్భవతులు ఈ పద్ధతి పాటించకూడదు.. చికిత్స తీసుకుని 48 గంటలు కూడా పూర్తి కానీ వారు ఈ పధ్ధతి పాటించకూడదు. వెన్నెముక, తొడ ఎముకలు, కంటి ఎముకలకు గాయాలయిన వారు, గుండె సమస్యలు ఉన్నవారు ఈ పద్ధతికి దూరం గా ఉండడమే ఉత్తమం. ఆహరం తీసుకున్నాక, ఒక గంట వరకు ఈ పధ్ధతి ని పాటించకూడదు. ఏ పొజిషన్ లో అయినా నొప్పి, ఒత్తిడి లేనంత వరకు మాత్రం ఈ ప్రోనింగ్ ను చేయాలి. ఇబ్బంది ఎదురవుతుంటే ఆపేయడం ఉత్తమం. ఒకవేళ ఎలాంటి ఇబ్బంది లేకపోతె.. 16 గంటల వరకు దశల వారీ గా ఈ ప్రక్రియను చేయవచ్చు.
End of Article