Ads
ఇటీవల కరోనా ఉద్ధృతి పెరుగుతోంది అని మనందరం అనుకుంటున్నాం.. కానీ మనమే కరోనా ను ఒకచోటు నుంచి ఒకచోటుకి తీసుకెళ్తూ ఉంటున్నాం. మనలో ఏ లక్షణాలు కనిపించకపోయినా కొన్నిసార్లు మనమే కరోనా వైరస్ ను క్యారీ చేస్తూ ఉంటాం. అయితే.. ప్రస్తుతం కరోనా సోకుతున్న వాళ్లలో ఎక్కువ మంది రికవర్ అయ్యి ఇంటికి చేరుకుంటున్నారు.
Video Advertisement

ఇది కొంతవరకు హర్షించదగ్గ పరిణామమే. కరోనా సమయం లో తక్కువ లక్షణాలు ఉంటె.. మీరు ఇంట్లో నే ఉండి చికిత్స చేసుకోవడం ఉత్తమం. పరిస్థితి ఇబ్బందికరం గా మారుతున్న సమయం లో వెంటనే ఆసుపత్రి లో చేరండి. స్వల్ప లక్షణాలను మందులతో నయం చేసుకోవచ్చు. అయితే.. కరోనా సోకిన వారు కొన్ని లక్షణాలు కనబడగానే కంగారు పడిపోతూ ఉంటారు.

సాధారణ జ్వరం, జలుబు లక్షణాలు కరోనా లక్షణాలు అయినప్పటికీ.. అప్పుడే కంగారు పడక్కర్లేదు. స్మెల్ తెలియకపోవడం, లేదా టేస్ట్ తెలియకపోవడం, లేదా రెండు తెలియకపోవడం వంటి లక్షణాలు కూడా ఉంటె అది కచ్చితం గా కరోనా సోకినట్లే. వేరే టెస్ట్ కూడా అవసరం లేదు. మీరు వెంటనే హోమ్ క్వారంటైన్ లో ఉండి వైద్యుల సాయం తో చికిత్స చేసుకోవడం ఉత్తమం.

అయితే.. మీకు స్మెల్ లేదా టేస్ట్ తెలియకపోతుంటే మీరు అదృష్టవంతులే. ఎలా అంటే.. ఈ లక్షణం ఉన్నవారిలో కరోనా తీవ్రత తక్కువ గా ఉండి తొందరలోనే వీరు కరోనా నుంచి కోలుకోగలుగుతారు. పదిహేను రోజుల పాటు వీరు క్వారంటైన్ లో ఉండి వైద్యులు సూచించిన మందులు వేసుకుంటే వీరు పూర్తి గా కరోనా నుంచి బయటపడగలుగుతారు. ఈ విషయాలను డా.సీఎల్ వెంకట్ రావు గారు వివరించారు. పూర్తి వివరణ కోసం మీరు ఈ కింద వీడియో చూడవచ్చు.
End of Article
