Home Health Adda కొత్తగా వస్తున్న బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి..? ఎందుకు వస్తోంది..?

కొత్తగా వస్తున్న బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి..? ఎందుకు వస్తోంది..?

by Anudeep

Ads

ఒక్క కరోనా మహమ్మారి వలనే మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో చూస్తూనే ఉన్నాం.. అయితే.. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు చోట్ల బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇది కరోనా కంటే ప్రమాదకారి అని తెలుస్తోంది. ఈ మహమ్మారి సోకినా వందమందిలో 50 మంది చనిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎక్కువ గా ఇది కరోనా సోకి నీరసించిన పేషంట్లలో కనిపిస్తోంది.

Video Advertisement

black fungus

వారిద్వారా ఇతరులకు కూడా వ్యాపిస్తోంది. గతం లో కూడా ఈ వైరస్ కు సంబంధించిన వ్యాధులు వచ్చినప్పటికీ.. ఇన్ని కేసులు నమోదవలేదు. ఈ వైరస్ సోకినవారి కళ్ళు, ముక్కు ఎరుపెక్కడం, తీవ్ర నొప్పిని కలుగచేయడం వంటివి జరుగుతున్నాయి. తలనొప్పి, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. కోవిడ్ చికిత్స లో భాగం గా ఎక్కువ మొత్తం లో స్టెరాయిడ్స్ ఉపయోగించడం, అలానే ఆక్సిజెన్ అందించే సమయం లో స్టెరైల్ నీటికి బదులు తేమను అందించే పరికరాన్ని వినియోగించడం వలన ఈ బ్లాక్ ఫంగస్ ఏర్పడుతోందని తెలుస్తోంది.


End of Article

You may also like