Ads
సాధారణం గా మనం డైలీ ఆహరం లో ఫ్రూట్స్ ను భాగం చేసుకుంటాం. రోజు ఫ్రూట్స్ పైనే డిపెండ్ కాకపోయినా.. కచ్చితం గా రోజుకు ఒక ఫ్రూట్ అయినా తినాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది దృష్టిలో ఉంచుకుని చాలా మంది తల్లులు పిల్లలకు కూడా రకరకాల ఫ్రూట్స్ పెట్టడం తో పాటు.. వారికి రోజుకో జ్యూస్ ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఫ్రూట్స్ ఇవ్వకుండా జ్యూస్ లు ఇవ్వడం కరెక్టేనా..? పిల్లలకు ఏ ఫ్రూప్ట్స్ ఇవ్వాలి.. ఎలా ఇవ్వాలి..?
Video Advertisement
ఈ విషయమై స్టోరీ టెల్లర్ రమా రావి గారు చక్కని వివరం ఇచ్చారు. పిల్లలకు చాలా మంది తల్లులు జ్యూసెస్ ఇచ్చేస్తూ ఉంటారు. కానీ.. షుగర్ అవసరం అయిన వారికీ.. బాగా నీరసించి ఉన్న వారికి, ఫ్రూట్స్ అరగని వారికి ఫ్రూట్ జ్యూస్ లు ఇవ్వాలి. చక్కగా తినగలిగిన వారికి ఫ్రూట్స్ ని పెట్టడమే కరెక్ట్. ఎందుకంటే.. జ్యూస్ లలో షుగర్ కలిపి చేస్తూ ఉంటాం.. దీనివలన పిల్లలలో ఎక్కువ మోతాదు లో షుగర్ చేరుతూ ఉంటుంది. అందుకే.. ఫ్రూట్స్ ను డైరెక్ట్ గా పెట్టడం అనేది మంచి పద్దతి అని రమా రావి గారు వివరించారు.
మరికొంతమంది పాలు ఇచ్చిన తరువాత ఒక గంటో , అరగంట ఆగి జ్యూస్ ఇస్తూ ఉంటారు. మనం ఇచ్చే ఫ్రూట్స్ లో అంటే బత్తాయి..ఇలాంటి జ్యూస్ లు పుల్లగా ఉంటాయి. పాలు తాగిన పిల్లలు జ్యూస్ లు తాగడం వలన వెంటనే వాంతి చేసేసుకుంటారు. పొట్టలో పాలు విరిగిపోవడం వలన ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. వీటన్నటికంటే.. అరటిపండు, ఆపిల్, కర్బుజా, పుచ్చకాయ లాంటి ఫ్రూట్స్ ని డైరెక్ట్ గా పెట్టేయడం ఉత్తమం. పసిపిల్లలకు అయితే.. ఆపిల్ పండుని ఉడకపెట్టి తొక్కు తీసేసి.. స్మాష్ చేసి పెట్టవచ్చు.. ఇలాంటి విషయాలను మీరు ఇంకా తెలుసుకోవాలంటుకుంటే.. ఈ కింద వీడియో చూడండి..
End of Article