Ads
ఇటీవల కాలం లో ఎక్కువ మంది గుండెపోటు బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఇది ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ.. వచ్చిందంటే మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రి కి పరిగెత్తాల్సిందే. మానసికం గా ఒత్తిడి అధికం అవడం, ఆహార నియమాలలో వచ్చే బేధాల కారణం గా ఎక్కువ మందికి గుండెపోటు వస్తోంది. అయితే.. పరిశోధకుల అధ్యయనం ప్రకారం ఈ గుండెపోటు ఎక్కువ గా సోమవారం రోజే వస్తుందట.
Video Advertisement
ఎందుకంటే.. ఆ రోజు అందరికి ఒత్తిడి ఎక్కువ గా ఉంటుంది. చాలా మందిలో వారాంతాల్లో బ్లడ్ ప్రెషర్ తక్కువ గా ఉంటుంది. వారం ప్రారంభం లో ఈ ఒత్తిడి ఎక్కువ ఉండడం చూస్తూనే ఉన్నాం. అంతే కాకుండా.. స్వీడిష్ రిజిస్ట్రీ 1,56,000 మంది పై జరిపిన సర్వే ప్రకారం చాలా మందికి సోమవారమే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని తేలింది. అలాగే 2006 వ సంవత్సరం నుంచి.. 2013 వరకు జాతీయ నాణ్యత రిజిస్ట్రీ లో హార్ట్ అటాక్స్ పై నమోదు చేసిన రికార్డు లను కూడా స్వీడిష్ వర్సిటీ పరిశోధకులు పరిశీలించారు. మిగతా రోజులకంటే సోమవారం గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువేనని తెలుస్తోంది.
End of Article