Ads
చాలా మంది బరువు తగ్గడానికి నానా ప్రయత్నాలు చేసి అలసి పోతూ ఉంటారు. ఎంత చేసినా ఇంకా తాము బరువు తగ్గమేమో అన్న నిర్ణయానికి వచ్చేసి అన్ని మానేస్తారు. ఇక్కడ ప్రయత్నాల్ని మానేయకూడదు. ప్రయత్నం చేసే విధానాన్ని సరి చేసుకోవాలి. ఎదో చేసాం అన్నట్లు కాకుండా సరిగ్గా ప్రయత్నిస్తే కచ్చితం గా బరువు తగ్గుతాం. అదెలానో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
Video Advertisement
నడక ద్వారా బరువు తగ్గాలనుకునే వారు రోజుకు కనీసం ముప్పై నుంచి తొంభై నిమిషాల వరకు నడవాలి. ఎక్కువ గా తగ్గాలి అనుకునే వారు కనీసం అరవై నిముషాలు అంటే 1 గంట సేపు నడవడం ద్వారా బరువు తగ్గచ్చు. అయితే.. ఎదో నెమ్మది గా నడిచాం అన్నట్లు కాకుండా.. కొంచం వేగం గా శరీరం అలసిపోయేలాగా నడవాలి. ఒకవేళ అంత సేపు నడవలేము అనిపిస్తే.. పదినిమిషాలు లేదా పావుగంటకు ఒకసారి విరామం తీసుకుంటూనో.. లేక నెమ్మది గా నడుస్తూనో నడక కొనసాగించాలి.
ప్రస్తుతం ఉంటున్న బిజీ షెడ్యూల్స్ లో రోజు ఒకే సమయం లో నడవడం కూడా సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు వారానికి కనీసం రెండున్నర గంటల పాటు నడిచేలా చూసుకోవాలి. అయితే ఇంత మొత్తం సమయాన్ని ఒకేసారి పూర్తి చేయడం మంచిది కాదు. నడక ప్రారంభించగానే ఒకేసారి ఎక్కువ సేపు నడవడం కాకుండా.. తొలిరోజు అరగంట సమయం తో ప్రారంభించి క్రమం గా సమయం పెంచుకుంటూ పోవాలి. అలాగే.. అరగంట నడవడానికి సమయం లేని వారు పదినిమిషాలు చొప్పున రోజులో కుదిరినప్పుడల్లా నడుస్తూ ఉండాలి.
ఎప్పుడైనా నడవడం కుదరకపోతే.. ఆ రోజుని వదిలేయండి. అయితే అలా ఎక్కువ రోజులు స్కిప్ చేయకుండా జాగ్రత్తపడండి. వీలైనంతవరకు ప్రతి రోజు నడవడానికి ప్రయత్నించండి. అలాగే.. మీరు తీసుకునే ఆహరం లో కూడా జాగ్రత్తలు తీసుకోండి. మీరు బరువు తగ్గగలరు అన్న పాజిటివ్ దృక్పధం తో ముందుకు వెళ్ళండి. కచ్చితం గా మీరు బరువు తగ్గుతారు.
End of Article