Ads
మన పరిసరాలను ఎంత శుభ్రం గా ఉంచుకుంటామో.. అలాగే.. మన శరీరాన్ని కూడా అంతే శుభ్రం గా ఉంచుకోవాలి. ముఖ్యం గా ఆడవారు ఈ విషయం లో మరింత జాగ్రత్త గా ఉండాలి. ఎందుకంటే ఆడవారి శరీర ధర్మాన్ని అనుసరించి వారికి మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా మంది ఆడవాళ్లు తమ ప్రైవేట్ పార్ట్స్ పట్ల అంత శ్రద్ధ వహించరు.. దానికి కారణం ఎవరు దాని గురించి వారికి తెలియచెప్పకపోవడమే.
Video Advertisement
ప్రతి ఒక్కరు ప్రైవేట్ పార్ట్స్ ని హైజీన్ గా ఉంచుకోవాలి. ఇందుకోసం కొన్ని టిప్స్ ను ఈ రోజు ఆర్టికల్ లో తెలుసుకోండి. మన శరీరం లో రకరకాల బాక్టీరియా ఉంటాయి. వీటిలో శరీరానికి మంచి చేసేవి కూడా ఉంటాయి. డైజెస్టివ్ సిస్టం లో లానే, వెగైనా వద్ద కూడా బాక్టీరియా ఉంటుంది. ఇది కొన్ని ఆసిడ్స్ ను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ ఆసిడ్ చెడు బాక్టీరియా దరిచేరకుండా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది.
అయితే చాలా మంది అతి శుభ్రత కోసం.. ఈ పార్ట్స్ లో సోప్, డెటాల్ వంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. సోప్ మంచిదే అయినా.. అదేపని గా క్లీన్ చేస్తూ ఉండడం వలన మంచి బాక్టీరియా కూడా నశిస్తుంది. దీనివలన మరిన్ని ఇబ్బందులు వస్తాయి. అలా అని రెగ్యులర్ గా క్లీన్ చేసుకోకపోయినా ఇబ్బందులు తప్పవు. అయితే.. వాష్ రూమ్ కి వెళ్లిన ప్రతిసారి సోప్ యూజ్ చేయడం వలన ఇబ్బందులు వస్తాయి. అలాగే.. పీరియడ్స్ టైం లో కూడా సరిగ్గా క్లీన్ చేసుకోవాలి.. లేదంటే ఆ ప్రాంతం లో చర్మ సమస్యలు వస్తాయి.
వయసు రీత్యా వస్తున్న మార్పుల్ని గమనించుకోవాలి. ప్రతి సారీ క్లీన్ చేసుకోవడం, బాత్ చేస్తున్నపుడు సోప్ తో క్లీన్ చేయడం, మంచి ఆయిల్స్ ఉపయోగించడం వలన కూడా వెగైనా శుభ్రం గా ఉంటుంది. అలాగే, ఆ ప్రాంతం లో దుర్వాసన రాకుండా ఉంటుంది. మరీ టైట్ గా ఉండే దుస్తులవలన కూడా లోపల ఇరిటేషన్ పెరుగుతుంది. ఇలా కాకుండా కాస్త గాలి ఆడే దుస్తులను వేసుకోవడం వలన వేగైనా శుభ్రం గా ఉంటుంది. మీ వెగైనా ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం.
End of Article