ఆన్ లైన్ లో డాక్టర్ ని కలుస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి..!

ఆన్ లైన్ లో డాక్టర్ ని కలుస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి..!

by Anudeep

Ads

ఈ కరోనా మహమ్మారి కారణం గా ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టడమే మానేసాం.. మరీ అవసరం అయితే తప్ప నిత్యావసరాలకి మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్లి వచ్చేస్తున్నాం.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కూడా బయటకు వెళ్లి రావడానికి జంకుతున్నాం.. అయితే, హాస్పిటల్స్ కి వెళ్లాల్సిన అవసరం వస్తే..? అందుకు కూడా చాలా మంది వాయిదాలు వేసేసుకుంటున్నారు. మరీ ఇబ్బంది అయితే తప్ప వెళ్ళడానికి ఇష్టపడడం లేదు.

Video Advertisement

doctor online 1

కానీ, కొందరు మాత్రం ఎంచక్కా ఆన్ లైన్ లోనే డాక్టర్ ని కన్సల్ట్ చేసి వారి సమస్యల్ని చెప్పుకుని.. వారు సూచించిన మందుల్ని తెప్పించేసుకుని ఆన్ లైన్ లోనే ఫీజు చెల్లించేస్తున్నారు. నిజానికి.. చిన్న సమస్యలకు ఈ కరోనా లాక్ డౌన్ కాలం లో ఆన్ లైన్ లో డాక్టర్ ని కన్సల్ట్ చేయడమే ఉత్తమం. అయితే.. ఆన్ లైన్ లో డాక్టర్ ని కన్సల్ట్ చేసేముందు కొన్ని జాగ్రత్తలను కచ్చితం గా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

doctor online 2

  • ముందుగా మీకు ఏ అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని ఒక పేపర్ పై రాసి ఉంచుకోండి.
  • అలాగే.. మీ బరువు, మీకు బిపి ఉంటె అది కూడా చెక్ చేసుకుని రాసి పెట్టుకోండి. మీ పల్స్ ఎంత ఉందొ అది కూడా చెక్ చేసుకుని పెట్టుకోండి.
  • ఒకవేళ అవసరం అవుతుంది అనుకుంటే బేసిక్ బ్లడ్ టెస్ట్ చేయించుకుని రిపోర్ట్ ని అందుబాటులో ఉంచుకోండి.
  • ముందుగానే, మీ రిపోర్ట్స్ ని యాప్ లో అప్ లోడ్ చేయడం ద్వారా పని మరింత సులువు అవుతుంది.
  • అలాగే మాట్లాడడం పూర్తి అయిన తరువాత, వైద్యుడిని సైన్ చేసిన డిజిటల్ ప్రిస్క్రిప్షన్ అడగడం మరిచిపోవద్దు.
  • అలాగే, పేమెంట్లు చేసేటప్పుడు కూడా అప్రమత్తం గా ఉండండి.

End of Article

You may also like