Home Off Beat మూడు రోజుల లవ్ స్టోరీ…ఎంతో మంది మరణాలు..! “రోమియో – జూలియట్” ల ఈ అసలు కథ గురించి తెలుసా.?

మూడు రోజుల లవ్ స్టోరీ…ఎంతో మంది మరణాలు..! “రోమియో – జూలియట్” ల ఈ అసలు కథ గురించి తెలుసా.?

by Anudeep

Ads

ప్రేమ ఎంత మధురమైనదో.. అంత కఠినమైనది కూడా.. ప్రేమ లేకుండా మనుషులు బతకడం కష్టం.. కానీ.. అదే ప్రేమ చాలా సార్లు మనల్ని అనేక కష్టాలలో పడేస్తూ ఉంటుంది. ఇప్పటి లవ్ స్టోరిల సంగతి పక్కన పెడితే.. ఒకప్పటి రోజుల్లో ప్రేమ చాల గాఢం గా ఉండేది. కలుసుకోవడానికి వీలుపడని, మాట్లాడుకోవడానికి కుదరని ఆరోజుల్లో ప్రాణానికి ప్రాణం గా ప్రేమించుకునేవారు.. అయితే.. ఒక ప్రేమ కోసం తల్లి తండ్రుల ప్రేమని పక్కన పెట్టాలా..? అన్న ప్రశ్నకి మాత్రం ఇప్పటికీ సమాధానం లేదు..

Video Advertisement

romeo 1

ప్రేమ కోసం చనిపోయిన రోమియో, జూలియట్ లను ప్రేమికులు ఆదర్శం గా తీసుకుంటుంటారు. కానీ.. చాలా మంది వారి ప్రేమ కథ ఎంతో లోతైనది అని అనుకుంటూ ఉంటారు..వాస్తవం లో వారిద్దరి లవ్ స్టోరీ లో అంత ఏమి ఉండదు. వారి లవ్ స్టోరీ కేవలం మూడు రోజులు మాత్రమే. ఆల్రెడీ ఒకామెను ప్రేమించిన రోమియో ఆమె ఒప్పుకోకపోయినా వెంటపడుతూ ఉంటాడు. ఓ రోజు ఆమె వెంటపడుతూ ఓ పార్టీ లో జూలియట్ ను చూస్తాడు.

romeo 2

తొలిక్షణమే జూలియట్ అందాన్ని చూసి రోమియో పడిపోతాడు. జూలియట్ వెంట తిరుగుతాడు. జూలియట్ కూడా తొలిచూపులోనే రోమియో ను ఇష్టపడుతుంది. కొంచం బెట్టు చేసినా వెంటనే ఒప్పేసుకుంటుంది. మూడు రోజులు కూడా నిలవకుండా చాలా గొడవలు అవుతాయి.. రోమియో నే రెండు హత్యలు చేస్తాడు. చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. జూలియట్ చనిపోయిందనుకుని రోమియో మరణిస్తాడు. రోమియో చనిపోవడం చూసి జూలియట్ కూడా కత్తి తో పొడుచుకుని మరణిస్తుంది.


End of Article

You may also like