మిస్ యూనివర్స్ పోటీలకు వెళ్లిన మొదటి భారత మహిళ…స్విమ్ సూట్ రౌండ్ లో బొట్టు, పూలు పెట్టుకొని.?

మిస్ యూనివర్స్ పోటీలకు వెళ్లిన మొదటి భారత మహిళ…స్విమ్ సూట్ రౌండ్ లో బొట్టు, పూలు పెట్టుకొని.?

by Anudeep

Ads

మిస్ యూనివర్స్ పోటీల గురించి మనందరికీ తెలుసు. అమెరికా కి చెందిన మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ నిర్వహించే ఈ పోటీలను ప్రపంచవ్యాప్తం గా చాలా మంది వీక్షిస్తారు. ఈ అందాల పోటీలో 190 కి పైగా దేశాలు పాల్గొంటాయి. మొట్టమొదటి మిస్ యూనివర్స్ పోటీ అరవై ఏడు సంవత్సరాల క్రితం అంటే 1952 లో జరిగింది. అప్పటినుంచి అందాన్ని అభినందించడం, గౌరవించడం మొదలైంది.

Video Advertisement

first miss universe 1

ఫిన్నిష్ అందాల రాణి ఆర్మీ హెలెనా కుసెలా మొదటి టైటిల్ హోల్డర్ మిస్ యూనివర్స్ 1952 కిరీటం లభించింది. అయితే.. మొట్ట మొదటి మిస్ యూనివర్స్ అందాల పోటీలో మన భారతీయ మహిళ కూడా పాల్గొందని మీకు తెలుసా..? ఆమె గురించి ప్రత్యేక స్టోరీ మీకోసం. ఆమె ఎవరో కాదు..భారతదేశపు మొట్టమొదటి మిస్ యూనివర్స్ పోటీదారు ఇంద్రానీ రెహ్మాన్.. ఆరోజుల్లోనే ఆమె అందం, ఆత్మవిశ్వాసం మెండు గా ఉన్నాయి. లారా దత్త, సుస్మితా సేన్ వంటి వారు భారతదేశానికి మరిన్ని పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి ఆమె తొలి అడుగు ముందుకేసింది.

first miss universe 2

ఇంద్రానీ చెన్నైకి చెందిన వ్యక్తి. ఆమె కుటుంబ నేపథ్యం చాలా ఆసక్తికరమైనది. ఆమె తల్లి, ఎస్తేర్ లుయెల్లా షెర్మాన్ ఒక అమెరికన్. మరియు తండ్రి, రామలాల్ బలరామ్ బాజ్‌పాయ్ ఒక భారతీయుడు. ఈ ఇండో-అమెరికన్ పేరెంట్స్ పెంపకం లో ఆమె ఎంతో స్వతంత్రం గా పెరిగారు. 15 సంవత్సరాల వయస్సులో, ఇంద్రానీ ముప్పై ఏళ్ల ప్రపంచ ప్రఖ్యాత వాస్తుశిల్పి హబీబ్ రెహ్మాన్‌తో కలిసి వెళ్లిపోయారు. ఆమె సాంప్రదాయ సమాజం యొక్క నియమాలకు అనుగుణంగా ఉండేవారు కాదు.

first miss universe 3

ఇంద్రాణి మరియు హబీబ్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆమె అందం, ఇండివిడ్యువాలిటీ అప్పట్లోనే సంచలనం. ఇవే కాదు ఇంద్రాణి సహజం గానే నృత్యకారిణి కూడా. భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలైన భరతనాట్యం, కుచిపుడి, కథాకళి మరియు ఒడిస్సీలలో ఆమె నాలుగు విభిన్న వైవిధ్యాలలో శిక్షణ పొందింది. తల్లి కంపెనీ లోనే ఐదేళ్ల పాటు శిక్షణ పొందిన ఇంద్రాణి ఆ తరువాత గురు చోక్కలింగం పిళ్ళై శిక్షణలో భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. కొరాడా నరసింహారావు వద్ద ఆమె కూచిపూడి కూడా నేర్చుకున్నారు..

first miss universe 4

1947 లో, భారతదేశపు ప్రముఖ కళ మరియు నృత్య విమర్శకుడు డాక్టర్ చార్లెస్ ఫాబ్రీ ఆమె నృత్యాన్ని చూసి ఆమె ను ఒడిసి కూడా నేర్చుకోవాలని సూచించాడట. ఆయన సూచనా మేరకు ఆమె ఒడిస్సి ని కూడా ఒడిసిపట్టుకున్నారు. మూడేళ్ళ పాటు సాధన తరువాత, ఆమె ఒక ప్రొఫెషనల్ ఒడిస్సీ నర్తకిగా మారారు. ఆ తరువాత 22 ఏళ్ళ వయసులో, ఓ పిల్లాడికి తల్లిగా, కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్ వద్ద 1952 లో మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొన్నారు. అదే సంవత్సరం ఆమెకు మొదటి మిస్ ఇండియా కిరీటం లభించింది.


End of Article

You may also like