చనిపోయిన వారి వద్ద ఏడవకూడదా..? ఎందుకని..? ఈ నిజాలు తప్పక తెలుసుకోండి..!

చనిపోయిన వారి వద్ద ఏడవకూడదా..? ఎందుకని..? ఈ నిజాలు తప్పక తెలుసుకోండి..!

by Anudeep

Ads

మన చుట్టాలో.. లేక మనకు దగ్గరివారో చనిపోతే మనకు అంతులేని దుఃఖం కలుగుతుంది. మనకి మనం సర్దిచెప్పుకోలేకపోతాము. మనకు ఇష్టమైన వారు మరణిస్తే ఆ బాధ చెప్పనలవి కాదు. వారి మృతదేహాన్ని చూస్తుంటేనే భోరున విలపిస్తాము. కానీ ఇలా విలపించడం తగదట. ఇలా ఎందుకు చేయకూడదో గరికపాటి గారు పూర్తి వివరణ ఇచ్చారు.

Video Advertisement

funeral 1

మీరెప్పుడైనా గమనించారా.. కొన్నిసినిమాలలో కొందరు మహిళలు మృతదేహం పై పడి గట్టిగా ఏడుస్తూ ఉంటారు. కొందరైతే ఇలా ఏడవడానికి కొందరు మనుషులకు డబ్బులు కూడా ఇచ్చి తెప్పిస్తారు. ఎంత ఎక్కువ ఏడిస్తే.. మరణించిన వారు అంత ఎక్కువ తృప్తి పొందుతారని వీరి నమ్మకం. తమిళనాడులో ఈ సంప్రదాయం ఎక్కువ గా కనిపిస్తూ ఉంటుంది. అందుకే “అరవ ఏడుపు” అన్న సామెత వచ్చింది. కానీ హిందూ సంప్రదాయాల్లో మాత్రం ఇలా చేయడం తగదని చెప్పబడింది.

జీవుడిని ఏడుస్తూ పంపకూడదని హిందూ సంప్రదాయం చెప్పింది. అసలు కన్నీళ్లతో శవాన్ని సాగనంపకూడదని చెబుతారు. సనాతన ధర్మమైన హిందూ ధర్మ శాస్త్రం లో ఈ విధం గా చెప్పబడి ఉంది. మనిషి శరీరం లో 72 వేల నాడులు ఉంటాయి. ఈ నాడులలో నిక్షిప్తమైన జ్ఞాపకాల తాలూకు కర్మ ఫలం పూర్తి అయ్యాక మనిషి కర్మనుంచి విముక్తి అయ్యి మోక్షాన్ని పొందుతాడు.

funeral 3

అందుకే మనుషులకు 72 ఏళ్ళు నిండితే పూర్ణాయుర్దాయం అంటారు. అలా కర్మలను పూర్తి చేసుకుని..మోక్షం పొందుతున్న వ్యక్తిని చూసి ఏడవకూడదని హిందూ ధర్మం చెప్పింది. చావు పుట్టుకలనేవి సహజం. పసి కూనలు, జీవితాన్ని ఇంకా చూడని యుక్త వయస్కులు, బాధ్యతలు పూర్తి కానీ మధ్య వయస్కులు మరణిస్తే మనం చేయగలిగిందేమీ లేదు.. కానీ దుఃఖం జీవుడిని వెనక్కి తీసుకురాలేదని చెప్పడమే ఇక్కడ ఉద్దేశ్యం.

Watch Video:


End of Article

You may also like