Ads
రామాయణం తెలియని భారతీయులు ఉండరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. రామాయణం తెలిసిన వారందరికీ రాముడే కాదు… రావణాసురుడి గురించి తెలిసి ఉంటుంది. రావణాసురుడి గురించి అందరికి తెలిసిన విషయం ఏంటంటే.. ఆయనకు పది తలలు ఉంటాయి అని. అసలు ఇది నిజమా.. కాదా..? ఇలా ఎందుకు చెప్పారు వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
నిజానికి.. ఇది చాలా కాంట్రవర్సీ అయ్యే విషయం. రావణాసురుడి తలల గురించి చాలా మందికి చాల సందేహాలు ఉన్నాయి. మరో వైపు.. ఈ విషయానికి క్లారిటీ ఇవ్వడానికి రకరకాల ఎక్స్ప్లనేషన్లు కూడా ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం ప్రముఖం గా చెప్పుకోబడుతున్నవి రెండు. అవేంటో.. మనం ఇప్పుడు చూద్దాం. ఓ పురాణ కథ ప్రకారం రావణుడి గుణ గణాలను వివరించడం కోసమే.. రావణుడికి పది తలలు ఉన్నాయని చెప్పారు.
ఒక్కో గుణం ఒక్కో తలను సూచించే విధం గా చెప్పారని అంటుంటారు. ఇంతకీ ఆ గుణాలేమిటంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, మానస, బుద్ధి, చిత్త, అహంకారం వంటి గుణాలు. వీటిని వర్ణించడానికి ఈ పదితలల గురించి ప్రస్తావన వచ్చిందని, రావణుడికి ఒక తల మాత్రమే ఉండేదని చెబుతారు. ఇందుకు సంబంధించి మరొక కథ కూడా ప్రచారం లో ఉంది.
రావణాసురుడు ఆ పరమ శివుని మహా భక్తుడన్న సంగతి మనందరికీ తెలుసు. ఆయన నిత్యం ఆ మహాశివుడిని గూర్చి పూజలు చేసేవారు. రావణుడు ఓ సారి ఘోర తపస్సు చేస్తూ.. పరమేశ్వరుడుకి తన తలను సమర్పిస్తాడు. వెంటనే మరొక తల వస్తుంది. ఆ తలను కూడా నరికేసుకుని శివుడికి సమర్పిస్తాడు. ఇలా పది సార్లు శివుడికి తన తలను సమర్పిస్తాడు. పదవసారి కూడా తన తలను సమర్పించాక శివుడు ప్రత్యక్షమవుతాడు. అన్ని తలలను తిరిగి రావణుడికి ఇచ్చేస్తాడట. అప్పటినుంచి రావణుడు పదితలల వాడయ్యాడట. అందుకే రావణుడిని దశాననుడు అని కూడా పిలుస్తూ ఉంటారు.
End of Article