Ads
దాదాపు ఏడాదిన్నర కాలం గా మన జీవిత విధానాలలో మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. కరోనా మహమ్మారి కారణం గా బయటకు వెళ్లడం, సన్నిహితులను కలవడం తగ్గిపోయింది. ఇంటికే పరిమితం అవడం, అత్యవసరం అయితే తప్ప బయటకి వెళ్ళకపోవడం, ఎవరిని కలవక పోవడం వలన మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. క్రమేపి ఇవి డిప్రెషన్ కు దారి తీస్తున్నాయి. ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు మీలో కూడా ఉన్నాయేమో చెక్ చేసుకోండి.
Video Advertisement
ఈ లక్షణాలను చెక్ చేసుకునే ముందు బాధ కు, డిప్రెషన్ కు తేడా తెలిసి ఉండాలి. మనం కోరుకున్నది దూరమైనా, అనుకున్నది జరగకపోయినా మనం బాధపడటం సహజం. అయితే.. కొంతసేపటికి ఆ బాధ నుండి తేరుకుని తరువాత ఏమి చెయ్యాలన్న దానిపై దృష్టి పెడతాం. అలా కాకుండా.. అదే బాధ లో ఉండిపోతూ.. తినడం, పడుకోవడం వంటి సహజం గా చేయాల్సిన పనులను కూడా మర్చిపోయి జీవితాన్ని వెళ్లదీస్తుంటే మాత్రం మనం ఆలోచనలో పడాల్సిందే.
- ఎప్పుడు చూసినా విచారంగా, నిరాశగా ఉండడం కూడా డిప్రెషన్ లో భాగమే.
- తరచుగా చిరాకు పడుతుండడం, రెస్ట్ తీసుకుంటూ ఉండడం, డల్ గా ఉండడం, అనవసరమైన విషయాల్లో ఆత్రుత గా ఉండడం వంటి లక్షణాలు మీలో ఉన్నాయా..?
- మీకు ఎంతో ఇష్టమైన పనులను కూడా ఇదివరకటి లా హుషారు గా చేయలేకపోతున్నారా..?
- అస్సలు ఆకలి వేయకపోవడం, లేదా అతిగా తినడం వంటివి చేస్తున్నారా?
- ఉన్నట్లుండి అతిగా బరువు పెరిగారా? లేదా తగ్గారా?
- దేనిపైనా దృష్టి నిలపలేకపోతున్నారా? మీరు సాధారణం గా చేయగలిగిన పనులను కూడా చేయలేకపోతున్నారా?
- మీపై మీకు నిస్సహాయత, అసహ్యం, ఏమి చేయలేకపోతున్నానే వంటి భావనలు చుట్టుముడుతున్నాయా?
- చిన్న చిన్న వాటికే అతిగా అలసిపోతున్నారా?
- ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయా..?
ఇటువంటి లక్షణాలు మీలో కనిపిస్తే మీరు డిప్రెషన్ దిశ గా అడుగులు వేస్తున్నారనుకోవచ్చు. ఇలాంటి ఆలోచనలు మీకు కలిగినపుడు గతం లో మీరు సాధించిన విజయాలను గుర్తు చేసుకోండి. పాజిటివ్ గా ఆలోచించడానికి ప్రయత్నించండి. మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోండి.
End of Article