Ads
సాధారణం గా పెద్దలు తమ పిల్లల సంతానం కోసం సంబంధాలు చూసేటప్పుడు పట్టించుకోని ముఖ్యమైన అంశం ఏజ్ గ్యాప్. చాలా మంది అమ్మాయిల వయసు అబ్బాయిల వయసు కంటే తక్కువ ఉంటె చాలు అనుకుని ముందుకెళ్లిపోతుంటారు. నాలుగైదు సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉన్నంత వరకు పరవాలేదు కానీ.. అంతకంటే ఎక్కువ ఉంటె ఇబ్బందులు తప్పవు.
Video Advertisement
ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి..? అన్న విషయమై కనీస అవగాహన కూడా చాలా మందికి ఉండదు. అసలు ఈ ఏజ్ గ్యాప్ వలన ఎదురయ్యే సమస్యలేంటో ఈరోజు తెలుసుకుందాం.
భార్య వయసు తక్కువ గా ఉండడం వలన ఆమె మనసు అర్ధం చేసుకోవడం భర్తకు సులువు అవుతుంది. ఎందుకంటే.. ఆడవారు మానసికం గా మగవారికంటే త్వరగా ఎదుగుతారు. అయితే.. భార్య వయసు భర్త వయసు కంటే మరీ ఎక్కువ గా ఉన్నా.. లేక భార్య వయసు కంటే భర్త వయసు మరీ ఎక్కువ గా ఉన్న సందర్భాల్లో వీరిద్దరిమధ్య ఈ క్రింది నాలుగు సమస్యలు ఏర్పడతాయి.
1. పిల్లలు కలగడం:
వయసు అంతరం వలన పిల్లలను కనే విషయం లో భార్యాభర్తలిద్దరికీ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వయసు ఎక్కువ ఉన్నవారు తొందరగా పిల్లలను కనాలని.. తక్కువ ఉన్నవారు ముందు జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ ఉంటారు. దీనివలన గొడవలు వస్తాయి.
2. అనుకూల సమస్యలు:
వయసు తేడా రీత్యా ఇష్టాయిష్టాలలో భేదాభిప్రాయాలు వస్తాయి. ప్రేమకు వయసుతో పని లేదు అన్న సూక్తులు కొంతవరకు బాగానే ఉంటాయి కానీ.. నిజజీవితం లోకి వచ్చేసరికి వయసు తేడా ఉన్న వారిలో ఎవరో ఒకరు రాజీ పడక తప్పని సరి పరిస్థితి ఏర్పడుతుంది. తరచుగా రాజి పడాల్సిన అవసరం వచ్చే వారికి జీవితం పై ఆసక్తి కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
3. సామాజిక ఇబ్బందులు:
భార్య వయసు భర్త కంటే ఎక్కువ ఉండడం కూడా ఇటీవల కొన్నిచోట్ల చూస్తున్నాం. కానీ.. ఈ అంతరం ఇంకా సామాజికం గా ఆమోదం పొందలేదు. ఇలా పెళ్లి చేసుకునే జంటలు సామాజికం గా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
4. లైంగిక ఇబ్బందులు:
ఇతర సమస్యలను పక్కన పెడితే.. వయోబేధం ఎక్కువ ఉన్న జంట లైంగిక ఇబ్బందులు కూడా ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే.. ఇద్దరి ఆలోచనలు, కోరికలు వేరుగా ఉంటాయి. దీనితో ఇబ్బందులు ఎదురవుతాయి.
End of Article