Ads
సాధారణం గా అవాంఛిత రోమాల వలన ఎదురవుతున్న ఇబ్బంది ఈనాటిది కాదు. అయితే.. వ్యక్తిగత అవయవాల వద్ద మాత్రమే కాకుండా మగవారికి గుండెల పైన, చెవుల వద్ద కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ అవాంఛిత రోమాలు ఏ ప్రదేశం లో సంగతి అయినా ఏమో కానీ.. చెవి దగ్గర వచ్చేవి మాత్రం మహా చికాకు పెడుతుంటాయి.
Video Advertisement
చూడడానికి బాగుండకపోవడం తో.. చెవి వద్ద ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. అసలు వాస్తవం గా ఆలోచిస్తే.. మనిషి కి అరచేతులు, అరికాళ్ళు, పెదవులు తప్ప అన్ని బాహ్య శరీర భాగాల వద్ద వెంట్రుకలు ఉండేవి. మానవులు కాలక్రమం లో అవి రూపాంతరం చెందుతూ వచ్చారు.. మీరు అప్పుడే పుట్టిన శిశువులను గమనిస్తే మీకు ఈ విషయం అర్ధం అవుతుంది. వారికి కూడా చెవులపైనా, అన్ని ఇతర శరీర భాగాలపైనా మృదువైన వెంట్రుకలు ఏర్పడి ఉంటాయి.
అయితే.. పెద్దవారు వారికి స్నానం చేయించే సమయం లో నాలుగు పెట్టి రుద్దడం ద్వారా వీటిని పోగొడతారు. రోజు నాలుగు పెట్టగా.. పెట్టగా కొన్ని రోజులకు ఈ మృదువు వెంట్రుకలు రాలిపోతాయి. అయితే.. పురుషుల్లో వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ చెవుల వద్ద జుట్టు వస్తుండడాన్ని మనం గమనించవచ్చు. దీనికి అసలు కారణం ఏంటంటే పురుషులలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి ఎక్కువ గా ఉండడమే. ఈ హార్మోన్ వల్లనే చెవుల వద్ద కూడా బూడిద రంగులో జుట్టు ఏర్పడుతూ ఉంటుంది.
దీని వలన ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు. దీనివలన ఓ లాభం కూడా ఉందండోయ్. ఈ వెంట్రుకలు ఇయర్ వాక్స్ తో కలిసి పనిచేస్తుంటాయి. బయట ఉండే దుమ్ము ధూళి వంటి పదార్ధాలను చెవి లోపలకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంది. ఇది ఎక్కువ గా భారత్, శ్రీలంక వంటి దేశాల్లోనే కనిపిస్తుంది. షేవింగ్, ప్లక్కింగ్, హెయిర్ రిమూవల్ క్రీమ్స్.. వంటి పద్దతుల ద్వారా… వీటిని తొలగించుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు.
End of Article