Ads
మనం వాడే ఆహార పదార్ధాలలో శనగపిండి, బియ్యప్పిండి, గోధుమ పిండి, మైదా పిండి వంటి పదార్ధాలు కూడా నిత్యావసరాలుగానే ఉన్నాయి. శనగపిండి శనగపప్పు నుంచి తయారవుతుంది. అలాగే.. గోధుమ పిండి గోధుమల నుంచి.. బియ్యప్పిండి రైస్ నుంచి తయారవుతాయి.
Video Advertisement
మరి మైదా పిండి ఎలా తయారు అవుతుందో తెలుసా..? ఎప్పుడైనా మీకు ఈ డౌట్ వచ్చిందా..? మైదా పిండి ఎలా తయారవుతుందో ఇప్పుడు ఇప్పుడు చూద్దాం.
నిజానికి మైదాపిండి కూడా గోధుమ పిండి నుంచే వస్తుంది. గోధుమలను మిల్లులో బాగా పోలిష్ చేస్తారు. ఈ పోలిష్ చేసిన గోధుమలను పిండి చేసి.. అజో బై కార్బొనమైడ్, బెంజోయిల్ పెరాక్సయిడ్, క్లోరిన్ గ్యాస్ వంటి రసాయనాలతో శుభ్రపరుస్తారు. వీటివల్లనే మైదా పిండి తెల్లగా.. మెత్తగా ఉంటుంది. నిజానికి ఈ బెంజోయిల్ పెరాక్సయిడ్, క్లోరిన్ గ్యాస్ ల వాడకాన్ని చైనా, ఐరోపా దేశాలలోను పూర్తి గా నిషేధించారు. ఇంకా ఈ మైదా తయారీలో అల్లొక్సన్ అనే రసాయనాన్ని కూడా వినియోగిస్తారు.
చాల దేశాలలో మైదాని నిషేధించిన..దక్షిణ భారత్ లో మాత్రం మైదా ను ఎక్కువ వంటకాలలో ఉపయోగిస్తున్నారు. తడి తగిలితే మైదా జిగురు పదార్ధం లా మారుతుంది. అందుకే దీనిని హోమ్ మేడ్ గమ్ గా కూడా ఉపయోగిస్తున్నారు. అలంటి పదార్ధాన్ని రవ్వ దోశలు, మిఠాయిలు, బ్రెడ్, బొబ్బట్లు వంటి పదార్ధాల తయారీలో విరివి గా వాడేస్తున్నారు.
ఈ మైదా పిండి తీసుకొచ్చే అనారోగ్యాలు అన్ని ఇన్ని కావు. ఎక్కువ మోతాదు లో తీసుకోవడం వలన అజీర్ణ సమస్యలు ఎదురవుతాయి. మైదా పిండి ని తమ వంటలలో ఎక్కువ గా వాడేవారు అధికం గా మధుమేహ సమస్యలను ఎదుర్కొంటారు. ఇవేకాక కిడ్నీలో రాళ్ళూ, గుండె జబ్బులు రావడం వంటి సమస్యలు కూడా ఈ మైదా ను ఎక్కువ గా వాడటం వలన వస్తుంటాయి. ఆహరం లో మైదా పిండి పాళ్లను ఎంత తగ్గిస్తే అంత మంచిది.
End of Article