Ads
గతేడాది జనవరి నుంచి ప్రపంచ దేశాలు కరోనా కారణం గా అవస్థ పడుతున్నాయి. ఈ మహమ్మారి వచ్చినప్పటి నుంచి లాక్ డౌన్ విధించడం తప్ప వేరే మార్గం లేకపోయింది. ఫలితం ప్రజల మానసిక ఆరోగ్యాలు, దేశ ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కోవిడ్ మాత్రం పెరుగుతూనే ఉంది. కరోనా నుంచి కోలుకునే వారు ప్రస్తుతం ఎక్కువ గానే ఉండడం కొంత ఉపశమనం కలిగించే విషయం.
Video Advertisement
10 టీవీ కథనం ప్రకారం… చాలా మందిలో కరోనా వచ్చి వెళ్లిన తరువాత ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. వారు పూర్తి స్థాయిలో మునుపు ఉన్నంత గా ఆరోగ్యం గా, ఉత్సాహవంతం గా పని చేయలేకపోతున్నారు. కొంతమంది వ్యక్తులైతే కరోనా నుంచి కోలుకుని ఏడాది గడుస్తున్నా.. వారి పరిస్థితి ఇబ్బందికరం గా ఉంటోందని తేలింది. ఈ విషయమై ఇటీవలే లాన్సెట్ లో ఓ అధ్యయనం ప్రచురించబడింది.
ఈ సర్వే ప్రకారం కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులను ఏడాది తరువాత పరిశీలించగా.. వారు ఏదో ఒక సమస్య తో బాధపడుతున్నారని తేలింది. ఈ సర్వే లో చైనా లోని వుహాన్ లో దాదాపు 1276 మంది కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులను అధ్యయనం చేయగా ఈ విషయం బయటపడింది. వీరిలో చాలా మంది జనవరి 20 , 2020 నుంచి మే 29 2020 వ సంవత్సరం లోపు డిశ్చార్జి అయినవారే. దాదాపు ఏడాది పైనే కావొస్తోంది.
వీరిలో 831 (68 శాతం)మంది కరోనా నుంచి కోలుకున్న ఆరునెలల తరువాత కూడా పోస్ట్ కోవిడ్ లక్షణాలతోనో, ఏదో ఒక అనారోగ్య సమస్యతోనో బాధపడుతూనే ఉన్నారు. ఇక 620 (42 శాతం) మంది ఏడాది గడిచినా అనారోగ్య సమస్యలతో సతమవుతూ ఉన్నారు. సర్వే లో పాల్గొన్న వారిలో 53 % మంది మొదటి ఆరునెలల్లో అలసట, కండరాల బలహీనత వంటి ఇబ్బందులతో బాధపడ్డారు. ఏడాది గడిచేసరికి ఈ శాతం 20 కి పడిపోయింది. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో 26 శాతం మంది శ్వాస ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐతే ఏడాది గరించేసరికి ఈ సంఖ్య ముప్పై శాతానికి పెరిగింది.
వెంటిలేటర్ సపోర్ట్ తో కోలుకున్న వారు ఏడాది గడిచినా శ్వాస సమస్య తో ఇబ్బందులు పడుతున్నారని తేలింది. 349 రోగులు శ్వాస సమస్యలను ఎదుర్కోగా.. వీరిలో 244 మందికి ఏడాది గడచినా కూడా వారి ఊపిరితిత్తులలో ఎటువంటి మెరుగైన పనితీరు కనిపించలేదు. మొత్తం 353 మంది రోగులు 12 నెలల పాటు సిటీ స్కాన్ చేయించుకున్నారని తేలింది. వీరిలో 52.7 % మందికి ఏడాది తరువాత ఊపిరితిత్తుల పనితీరులో మార్పు కనిపించిందని తేలింది.
ఈ అధ్యయనం లో పాల్గొన్న రోగుల సగటు వయసు 57 సంవత్సరాలు గా ఉంది. వీరిలో 53 శాతం మంది ఉద్యోగం నుంచి పదవి విరమణ పొందారు. మిగిలిన 479 మందిలో 88 శాతం మంది తిరిగి తమ విధులలో చేరారని తెలుస్తోంది. తిరిగి ఉద్యోగం చేరిన వారిలో దాదాపు 76 శాతం మంది పూర్వ సామర్ధ్యం తో పని చేయగలుగుతున్నారు. పురుషులతో పోలిస్తే స్త్రీలు ఎక్కువ గా కండరాల బలహీనత, అలసట, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పరిశోధనలతో తేలింది ఏమిటంటే.. కరోనా నుంచి కోలుకున్న.. తిరిగి ఆసుపత్రికి వచ్చే రోగులకు చికిత్స అందించాల్సి ఉంటుంది.
End of Article