Ads
మనం హెల్ది గా మన రోజుని ప్రారంభించాలంటే.. ఆరోగ్యకరమైన ఆహరం తప్పనిసరి. అయితే.. ఉదయం నిద్ర లేవడం ఏ మాత్రం ఆలస్యమైనా చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడమో.. లేక అందుబాటులో ఉన్న ప్యాకెడ్ ఫుడ్ తినేయడమో చేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. ఈ ఐదు ఆహారాలను మీరు ఉదయం సమయం లో తీసుకుంటుంటే.. తప్పని సరిగా ఈ అలవాటు కు చెక్ పెట్టండి. ఇక ఆ ఐదు ఆహారాలు ఏంటో ఓ లుక్ వేయండి.
Video Advertisement
ప్రొసెస్డ్ ఫుడ్: ఉదయాన్నే ప్రాసెస్ చేయబడ్డ ప్యాకెజీ ఫుడ్ ను తినడం మంచిది కాదు. ఇది శరీరం లో కొవ్వుని మరింత గా పెంచుతుంది. వీటిల్లో ఉండే నూనె, ఇతర పదార్ధాలు శరీరానికి హాని చేస్తాయి. చిప్స్, పాప్ కార్న్ లాంటివి అస్సలు తినకండి.
కేక్స్: ఆయిల్ ఉండదు గా, టేస్టీ గా ఉంటుంది అనుకుంటూ ఇలాంటి పదార్ధాలను తీసుకోవడం కూడా మంచిది కాదు. చక్కర, పిండి పదార్ధాలు ఎక్కువ గా కలిగిన ఈ ఆహార పదార్ధాలు ఉదయాన్నే తీసుకోవడం మంచిది కాదు.
నూడుల్స్: ఇవి బ్రేక్ ఫాస్ట్ గా కంటే సాయంత్రం స్నాక్స్ గా తీసుకోవడమే మేలు. ఉదయాన్నే నూడుల్స్, మ్యాగీ లాంటివి తినడం మంచిది కాదు.
ఫ్రూట్ జ్యూస్: ఫ్రూట్ జ్యూస్ లను చేసుకోవడం ఈజీ నే కానీ ఉదయాన్నే తీసుకోవడం అంత మంచిది కాదు అని అంటున్నారు. మీరు ఫ్రూట్స్ తింటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ వీటిని జ్యూస్ గా చేసుకుని అందులో చక్కర కలుపుకుని తాగడం అయితే మంచిది కాదు.
పూరి, పరోటా: పూరి అందరి ఫేవరెట్ ఫుడ్. కానీ ఉదయాన్నే నూనెలో వేయించిన పూరి, పరోటా వంటి ఫుడ్ లు తిరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెంచుతాయి. కాబట్టి ఉదయాన్నే తేలిక పాటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
End of Article