Ads
శ్రీ కృష్ణుడికి దేశమంతా భక్తులే. ఆయన జన్మదినమైన శ్రీ కృష్ణాష్టమి రోజున ఆయనను స్మరించుకొని వారు ఉండరు. ఆరోజు ఉపవాసం ఉండడం, శ్రీ కృష్ణ భగవానుని పూజించడం, ఆయన వేణువుని కూడా ఆరోజు పూజిస్తారు. మనం ఎప్పుడు శ్రీకృష్ణుడి ఫోటో లు చూసినా.. లేక సినిమాలలో చూసినా.. ఆయన చేతిలో వేణువు కచ్చితం గా ఉంటుంది. అయితే ఆయన వేణువు ను ఎప్పుడు తనవద్దే ఎందుకు ఉంచుకుంటారో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
శ్రీకృష్ణ పరబ్రహ్మ కు వేణువు శక్తి లాంటిది. ప్రేమ, శాంతి సందేశాన్ని అందించే ఆయుధమే వేణువు. అవి అందరికి పంచడం కోసం.. ఆయన ఎప్పుడు చెంత వేణువు ను ఉంచుకునేవారు. శ్రీకృష్ణుడు వేణువు ను ఎంత మధురం గా వాయిస్తారో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. ఆ వేణువు నుంచి వచ్చే నాదం పరిసరాల్లోని చెడు శక్తిని పారద్రోలి వాతావరణాన్ని తేలికపరుస్తుంది.
శ్రీకృష్ణ భగవానుడికి వేణువు ను సమర్పించి ఆరాధిస్తే ఆ ఇంట కష్టాలకు చోటుండదు. సకల శుభాలతో ఆ ఇంట ఆనందం వెల్లివెరిస్తుంది. వెదురు వేణువు ను తీసుకొచ్చి కృష్ణ భగవానుడికి సమర్పించండి. రెండవరోజు ఆ వేణువు ను ఇంటి తూర్పు గోడకు కడితే.. ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. చెక్క లేదా వెదురు తో చేయబడ్డ వేణువు ఉన్న ఇంట్లో శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడని విశ్వసిస్తారు.
అలాగే ఆఫీస్ లలోను, వ్యాపారాలు జరిగే స్థలం వద్ద కూడా వేణువు ను ఉంచడం వలన ఆర్ధిక ఇబ్బందులు తొలగి.. పనులు సక్రమం గా సాగుతాయని చెబుతుంటారు. వేణువు ను వాయిస్తున్నప్పుడు వచ్చే శబ్దం వలన అందరు ఆ శబ్దానికి వశమైపోతారు. ఈ ధ్వని కి ప్రతికూల శక్తిని నాశనం చేసే సత్తా ఉంది. ఈ శబ్దం ప్రేమను కురిపిస్తుంది. అందుకే వేణువు ఉన్న ఇంట్లో ప్రేమానురాగాలు ఉప్పొంగుతాయి.
భార్య భర్తల మధ్య సఖ్యత కుదరకపోతే.. ఒక వేణువు ను బెడ్ రూమ్ లో ఉంచడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరైనా ఇంట్లో అనారోగ్యానికి గురి అయితే.. వారు ఉన్న గది తలుపుకు వేణువు ను వేలాడతీయడం వలన.. వారు త్వరగా కోలుకుంటారు. వేణు నాదానికి ఇంత శక్తి ఉండబట్టే.. శ్రీ కృష్ణ భగవానుడు అనుక్షణం వేణువు ను తనతోనే ఉంచుకునేవారు.
End of Article