Ads
హిందువులలో చాలా మందికి గోత్ర నామాలు ఉంటాయి. ఈ నామాలు ఎలా వచ్చాయి అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఒకే గోత్రనామం ఉన్న అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోకూడదు అంటుంటారు.. ఇందులో నిజమెంత..? ఈ సంగతి ఈ ఆర్టికల్ లో చూద్దాం. పూర్వం స్కూల్స్, కాలేజీలు లేని రోజుల్లో ప్రతి కుటుంబానికి గురువులు ఉండేవారు.
Video Advertisement
ఆ గురువుల పేర్లే తరువాత కాలం లో గోత్రనామాలు గా చెప్పుకుంటున్నాం. విద్యను నేర్పించిన గురువు పేరు ఏదైతే ఉంటుందో.. అదే ఆ కుటుంబం యొక్క గోత్రం గా చెప్పబడుతుంది. విద్యను అభ్యసించనివారు కూడా.. తమ గురువు పేరును గోత్రం గా చెప్పుకుంటూ ఉంటారు. ఒకే గోత్ర నామం కలిగిన వారు అన్నదమ్ములు, లేదా సోదర సోదరీమణులు అవుతారు. అందుకే ఒకే గోత్రం ఉన్న అమ్మాయికి, అబ్బాయికి వివాహం తగదని చెబుతారు.
వారిద్దరూ ఒకరినొకరు తెలియకపోయినా.. ఒకే గోత్రం వారు అగుటచేత బీరకాయ పీచు బంధుత్వమైనా ఉండే ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితమే వారి పూర్వీకులకు రక్త సంబంధం ఉండే ఉంటుంది. అది భవిష్యత్ లో ఇబ్బందులు తీసుకురాకూడదు అని అలా చెబుతుంటారు. అందుకే.. ఒకే గోత్రికుల వివాహానికి హిందూ ధర్మ శాస్త్రం అంగీకరించలేదు.
End of Article