ఆ ఆరు టిప్స్ తో మీ జీవితం లో “మాజీ” కు గుడ్ బై చెప్పేయండి.. అవేంటంటే..?

ఆ ఆరు టిప్స్ తో మీ జీవితం లో “మాజీ” కు గుడ్ బై చెప్పేయండి.. అవేంటంటే..?

by Anudeep

Ads

ప్రతి ఒక్కరి జీవితం లోను ప్రేమ ఎదురవుతుంది. స్కూల్ లైఫ్, కాలేజీ లైఫ్, లేదా ఆఫీస్ లైఫ్ లో ఎక్కడో ఒక చోట ప్రేమ చిగురిస్తుంది. తమకు నచ్చిన వారు తమ జీవితాంతం ఉండాలనే కోరిక పెరుగుతుంది. కానీ.. పరిస్థితులు, ఇంట్లో పెద్దలు, సామాజిక కట్టుబాట్లు.. కారణం ఏదైనా ఈ ప్రేమ పెళ్లి వరకు వెళ్లకపోవచ్చు. లేదా పెళ్లి అయ్యిన తరువాత, భార్య భర్తలు ఇద్దరికీ అనుకూలించకపోవడం వల్ల విడిపోవాలనుకోవచ్చు. ఇద్దరు ఇష్టపూర్వకం గా విడిపోతే గొడవ రాదు. కానీ మన మనసులో వారిపై ఇష్టం ఉన్నా.. వారిని దూరం చేసుకోవాలంటేనే భరించలేనంత బాధ వస్తుంది.

Video Advertisement

breakup 1

ఒక సారి రిలేషన్ షిప్ బ్రేక్ అయితే.. దాని వలన వచ్చే బాధ కష్టతరం గా ఉంటుంది. చాలా మంది అమ్మాయిలు ఇంట్లోనే ఉండిపోయి గంటల తరబడి ఏడుస్తుండడం, ఫోటోలు చూసుకుంటూ ఆ బాధని మరింత పెంచుకుంటూ ఉంటారు. అంతే తప్ప తిరిగి మాములు జీవితం గడపలేకపోతుంటారు. ఇక అబ్బాయిలు అయితే తాగుడు వంటి వాటికి అలవాటు పడుతుంటారు. జీవితాంతం కలిసి ఉండాలి అని అనుకున్న వ్యక్తులు విడిపోవాల్సి వస్తే.. ఆ బాధను ఇద్దరూ అనుభవిస్తారు. ఈ బాధ నుంచి బయటపడడానికి ఆరుసూత్రాలున్నాయి. అవేంటో ఓ లుక్ వేయండి

ఒంటరిగా ఉండద్దు:
మాజీ ప్రేమికురాలు/ప్రేమికుడిని తలుచుకుని ఒంటరిగా గడపకండి. వారి జ్ఞాపకాల్లోనే ఓదార్పుని వెతుక్కోవాలనుకుంటే ఆ ప్రయత్నాన్ని విరమించండి. గడిచిపోయిన కాలాన్ని తలుచుకోవడం వృధా ప్రయాసే తప్ప ఉపయోగం ఉండదు.

breakup 5

తిరిగి మాట్లాడాలని అనుకోకండి:
ఒకసారి దూరం అయ్యాక.. వారి గురించి మరింత ఎక్కువ గా ఆలోచిస్తూ ఉంటాం. ఏదో ఒక కారణం తో వారితో తిరిగి మాట్లాడాలని ప్రయత్నించకండి. వారికి పదే పదే మెసేజ్ చేయడం, కాల్ చేయడం వంటివి వద్దు. సాధ్యమైనంత వరకు వారితో ఏ విషయము మాట్లాడకుండా ఉండడమే మంచిది.

breakup 2

గిఫ్ట్స్ ను పడేయండి:
మీరు ప్రేమలో ఉన్నప్పుడు ఒకరినొకరు బహుమతులు ఇచ్చుకుని ఉండి ఉంటారు. మీరు కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు, ఇంట్లో ఉండే ఫోటో ఫ్రేమ్స్, వారు ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని మీకు కనిపించనంత దూరం తీసుకెళ్లి పడేయండి. ఇంట్లో ఫర్నిచర్ ని కూడా మార్చేసుకోండి. మీకు నచ్చిన రంగుల్లో బెడ్ షీట్స్, విండో కర్టైన్స్ తో అలంకరించుకోండి. తద్వారా.. ఆ ఇల్లు చూడగానే మీది అనే భావన కలుగుతుంది. మనసులో మీ పై మీకు ప్రేమ పెరుగుతుంది.

మీ గురించి రాయండి:
ఒక బుక్ తీసుకుని.. మీ గురించి మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి. మీలో ఉన్న ప్రత్యేక లక్షణాలను, మీకు నచ్చే అంశాలను రాసుకోండి. తద్వారా మీపై మీకు ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మీ భవిష్యత్ గురించి మీ కల ఏమిటో రాసుకోండి. దాని వల్ల అది సాధించాలి అన్న పట్టుదల పెరుగుతుంది.

breakup 4

టు డు లిస్ట్:
ఓ ఆరు నెలల్లో మీరు ఎలా మారిపోవాలి అనుకుంటున్నారో ఊహించుకుని.. అందుకు తగ్గగట్లే లిస్ట్ ను తయారు చేసుకోండి. మీరు ఏమేమి పనులు చేయాలనుకుంటున్నారో.. వాటి లిస్ట్ ను ప్రిపేర్ చేసుకుని రాయండి. మీరు గతం లో చేయాలనుకుని చేయలేకపోయిన పనుల జాబితా సిద్ధం చేసుకుని ఈ ఆరు నెలలలో వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి.

మీరు ప్రత్యేకం:
మీరు చేసే పనుల ద్వారా మీ ఆత్మ సాక్షి సంతోషపడేలా ప్రవర్తించండి. మీకు మీరు ప్రత్యేకం అనే విషయాన్నీ మీ మనసు గ్రహించే విధం గా మసలుకోండి. మీకు ఇష్టమైన సన్నిహితులను పిలిచి పార్టీ చేయండి. తద్వారా మీకంటూ కొత్త ప్రపంచం ఉందని మీ మనసు గుర్తించి తొందరలోనే మీ మాజీ ప్రేయసి/ప్రియుడు తాలూకు బాధ నుంచి బయటపడుతుంది.


End of Article

You may also like