Ads
చాణుక్యుడు భారతీయులందరికి సుపరిచుతుడే. అర్ధశాస్త్రాన్ని ఔపోసన పట్టి, సకల రాజనీతి జ్ఞానాన్ని సముపార్జించిన వాడు చాణుక్యుడు. అర్ధశాస్త్రాన్ని రచించింది ఈయనే అని మనకి తెలిసినదే. ఈయన రచయితా గా, సలహాదారుని గా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. ఈయన చెప్పిన నీతి సూత్రాలు నేటికీ ఆచరించుకుని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
Video Advertisement
ఓ మూడు విషయాలను అదుపులో ఉంచుకుంటే.. ఏ పనిలో అయినా విజయం సాధించవచ్చని చాణుక్యుడు చెబుతున్నాడు. చాలా మందికి వెన్నుపోటు పొడిచే అలవాటు ఉంటుంది. నమ్మిన వారిని మోసం చేయడం వల్ల భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు. అందుకే ఈ అలవాటును వదిలేసుకోవాలి. అలాగే అబద్ధాలు చెప్పే అలవాటును కూడా మానుకోవాలి. పదే పదే అబద్దాలు చెప్పడం మంచిది కాదు. తగినంత కారణం లేనిదే అబద్ధం చెప్పకండి. గొప్పలు చెప్పుకోవడం మూడవది. ఈ అలవాటు ని కూడా అదుపులో ఉంచుకోవాలి. నోరు జారి గొప్పలు చెప్పుకోవడం వల్ల లేనిపోని ఇక్కట్లు వస్తాయి.
End of Article