Ads
ఈ ప్రశ్న చూడగానే అర్ధం కాలేదా..? మీరెప్పుడైనా ముక్కు మూసుకుని మాట్లాడారా? కచ్చితం గా మీ గొంతు లో తేడా ఉండే ఉంటుంది. అలాగే.. పెదాలు కదపకుండా సన్నగా పాటలను కానీ, లేదా ఏదైనా మ్యూజిక్ ని కానీ హమ్ చేశారా..? మీరు ముక్కు మూసుకోకుండా హమ్ చేస్తే.. చిన్న గా సౌండ్ వస్తూ ఉంటుంది.
Video Advertisement
కానీ.. మీరు ముక్కు మూసుకుని ఉంటే.. ఇలా హమ్ చేయడం సాధ్యం కాదు. నమ్మశక్యం గా అనిపించడం లేదా..? మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ముక్కును మూసుకుని.. నోరును కూడా మూసేసి.. పెదాలు కదపకుండా హమ్ చేయడానికి ప్రయత్నించి చూడండి. ట్రై చేశారా..? హమ్ చేయలేకపోతున్నారు కదా.. ఎందుకు హమ్ చెయలేకపోతున్నారో తెలుసా..?
ఎందుకంటే మనం హమ్ చేస్తున్నప్పుడు కచ్చితం గా గాలిని బయటకు వదులుతాము. అదే ముక్కుని, నోరుని మూసివేసినప్పుడు ఈ గాలి బయటకు రావడానికి అవకాశం ఉండదు. ఇలా గాలి బయటకు వచ్చినప్పుడే శబ్దం ఉత్పత్తి అవుతుంది. మీరు ముక్కు, నోరు మూసివేస్తే.. ఇది పాజిబుల్ కాదు. వెంటనే నోరు తెరిచి అయినా సరే శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. ఇది షాకింగ్ గా అనిపించినా వాస్తవమే. మనం నోరుని, ముక్కుని మూసేసి హమ్ చేయలేము. కావాలంటే ప్రయత్నించి చూడండి.
End of Article