Ads
గణపతి పురుష రూపం. ఏకదంతం, తొండం కలిగిన ధీశాలి గణపతి. ఈయన విఘ్నాలకు అధిపతి కాబట్టి ఆయనను విఘ్నేశ్వరుడు అని కూడా పిలుస్తూ ఉంటాం. మనందరికీ గణపతి గురించి తెలుసు.. కానీ తెలియని విషయం ఏమిటంటే.. గణపతి కి స్త్రీ రూపం కూడా ఉందని. ఆ రూపం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
తంత్ర శాస్త్రం లో గణపతి స్త్రీ రూపం గురించి చెప్పబడింది. ఈ రూపాన్ని వినాయకి అన్న పేరుతో పిలుస్తారట. అయితే.. ఈ రూపాన్ని పూజించడానికి చాలా నియమ నిష్టలు అవసరం. ఈ రూపం యొక్క బీజ మంత్రాన్ని నిష్ఠగా పూజిస్తే.. వినాయకి కరుణించి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందట. ఈ బీజ మంత్రం లోనే ఇతర దేవతలకు సంబంధించిన బీజాక్షరాలు కూడా కనిపిస్తుంటాయి. అందువల్లే.. ఈ మంత్రాన్ని నిష్ఠగా జపించడం వలన కోరిన కోరికలు తీరతాయట.
|| ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం ఐం హ స ఏ ఈ ల హ్రీం తత్ సవిత్సవరేణ్యం గణపతయే క్లీం హ స క హ ల హ్రీం భర్గోదేవస్య ధీమహి వర వరద సౌ స క ల హ్రీం థియో యోనః ప్రచోదయాత్ సర్వ జనమ్మే వశమానయ స్వాహా ||
ఈ గణపతి రూపానికి వాంఛా కల్పలత గణపతి అన్న పేరు కూడా ఉంది. వాంఛా అంటే కోరిక అని అర్ధం. కల్పలత అంటే ఇచ్చునది అని అర్ధం. కోరిన కోరికలను తీర్చే గణపతి కాబట్టే ఈ రూపాన్ని ఈ పేరుతో పిలుస్తారట. ఈవిడనే శ్రీ విద్యా గణపతి అని కూడా పిలుస్తారట. ఈ బీజా మంత్రాన్ని గురువు ద్వారా స్వీకరించి జపం చేయాలట. మహాగణపతి మంత్రాన్ని 444 సార్లు పఠించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ వాంఛా కల్పలత గణపతిని పూజించడం వలన కూడా అలంటి ఫలితాలే కలుగుతాయట.
వివాహం ఆలస్యం అవుతుండడం, దాంపత్య సుఖం లేకపోవడం, పిల్లలు లేకపోవడం, విద్యాపరంగా అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగపరం గా ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం… ఈ గణపతి ని ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరతాయట. అయితే.. జపం, తర్పణం వంటి పూజలను వామాచార విధానం లో ఆచరించడం వలన శుభ ఫలితాలు ఉంటాయట.
నోట్ : ఈ వివరాలను కేవలం ఒక అవగాహనా కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది.
End of Article