Ads
లాక్ అనేది అందరికి అవసరమైనదే.. ఇంట్లోంచి బయటకెళ్ళేటప్పుడు ఇంటికి కచ్చితంగా తాళం వేసే వెళ్తాము. అలాగే.. ఏదైనా టూర్ కి వెళ్ళినప్పుడు మన లగేజ్ ను జాగ్రత్త గా ఉంచుకోవడం కోసం దానికి కూడా లాక్ ఉండేలా చూసుకుంటాం. చిన్న సైజు లాక్స్ అయితే కీస్ ఉంటే సరిపోతుంది. అయితే.. ఈ కీస్ పోయినప్పుడే సమస్య ఎదురవుతూ ఉంటుంది.
Video Advertisement
అందుకే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవకుండా ఉండడానికి నెంబర్-బేస్డ్ లాక్స్ వచ్చాయి. మనం లాక్ ఓపెన్ చేయాలంటే.. అందుకు తగిన కోడ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు తాళం చెవితో ఇక అవసరం ఉండదు. మరి ఈ కోడ్ ను మర్చిపోతే..? అప్పుడు ఇబ్బంది వస్తుంది కదా? అందుకే చాలా మంది తమ ఫోన్ లోనో, లేక ఏదైనా బుక్ లోనో కోడ్ ను సేవ్ చేసుకుంటూ ఉంటారు. కానీ.. ఇకపై ఆ అవసరం కూడా లేదు.
ఓ చిన్న ట్రిక్ తో.. కోడ్ తెలియకపోయినా మనం ఇలాంటి లాక్స్ ను ఓపెన్ చేయవచ్చు. ఇది చాలా సింపుల్. ముందుగా ఆ నంబర్స్ ఉన్న చక్రాలను తిప్పుతూ ఉండాలి. వాటికి కింద ఒక హోల్ వస్తోందో లేదో గమనించాలి. ఏ నెంబర్ దగ్గర అయితే హోల్ వస్తుందో ఆ నెంబర్ దగ్గర ఆపేయాలి. అలా హోల్ వచ్చిన నెంబర్ దగ్గర నుంచి ఆ చక్రాన్ని మరో మూడు డిజిట్స్ దాటే వరకు తిప్పాలి.
ఉదాహరణకి, 2 – 5 – 6 అనే డిజిట్స్ దగ్గర హోల్ వచ్చింది అని అనుకుందాం. మరో త్రి డిజిట్స్ జరిగే వరకు ఒక్కొక్క చక్రాన్ని వెనకకు తిప్పుతూ రావాలి. అప్పుడు కోడ్ 9 – 2 – 3 గా వస్తుంది. ఆ నంబర్స్ వరుసగా రాగానే.. మీ సూట్ కేస్ ఓపెన్ అవుతుంది. ఇది చాలా సింపుల్ ట్రిక్. మీరు ప్రయత్నించి చూడండి.
End of Article