Ads
ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏవేవో డైట్ ప్లాన్స్ ను కూడా ఫాలో అవుతూ ఉంటారు. కానీ, ఇవేమి సహకరించక బరువు తగ్గలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. బరువు తగ్గడానికి శరీర తత్వానికి సరిపడే వ్యాయామం చేయాలి. అందుకు తగ్గ డైట్ ను కూడా ఎంచుకోవాలి. అయితే.. ఎంత చేసినా చాలా మంది బరువు తగ్గడం లేదు అంటూ వాపోతుంటారు.
Video Advertisement
అయితే.. కేవలం డైట్ పాటించడం వల్ల మాత్రమే బరువు తగ్గుతారు అనుకుంటే పొరపాటే. దానికి తగ్గ ఎక్సర్‌సైజ్ లు కూడా చేస్తూ ఉండాలి. మన శరీరం లో ఏ బాడీ పార్ట్ లో ఎక్కువగా ఫాట్ ఉందొ చూసుకుని.. ఆ పార్ట్ లో కొవ్వు కరిగే విధంగా ఎక్సర్‌సైజ్ లు చేసినా మంచి ఫలితం ఉంటుంది. చాలా మందిని వేధించే సమస్య పొట్ట. ఎక్కువ బరువు ఉన్న వారు ముందు తమ పొట్టను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఫ్లాట్ స్టమక్ ఉండాలి అని అందరు కోరుకుంటారు. కానీ, దానికోసం చాల కష్టమైన ఆసనాలు వేయాలని భావిస్తూ ఉంటారు. అదంతా అవసరం లేదు. కొన్ని సులువైన ఎక్సర్‌సైజ్ లు కూడా పొట్టను తగ్గిస్తాయి. ఇటీవల ఓ అమ్మాయి జపనీస్ అమ్మాయిలు చేసే టవల్ ఎక్సర్‌సైజ్ ను టిక్ టాక్ లో పోస్ట్ చేసింది. ఇది పది రోజుల్లో క్రమం తప్పకుండ చేస్తే మంచి ఫలితం చూపిస్తోందట..
దీనితో ఈ వీడియో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. కేవలం ఒక టవల్, యోగ మాట్ ఉంటె చాలు ఈ ఎక్సర్‌సైజ్ ను ఎవరైనా చేసేయచ్చు. క్రమం తప్పకుండ చేస్తే మంచి ఫలితం ఉంటుందట. ఈ ఎక్సర్‌సైజ్ ఎలా చేయాలో ఈ కింద వీడియో లో చూసేయండి.
watch video:
https://in.pinterest.com/pin/741616263632146789/
End of Article