మాములుగా ఉన్నప్పుడుకంటే ట్రావెలింగ్ టైంలోనే మొబైల్ బ్యాటరీ ఎందుకు డౌన్ అయిపోతుంది?

మాములుగా ఉన్నప్పుడుకంటే ట్రావెలింగ్ టైంలోనే మొబైల్ బ్యాటరీ ఎందుకు డౌన్ అయిపోతుంది?

by Anudeep

Ads

మన జీవితం లో చాలా సార్లు ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తూనే ఉంటుంది. అయితే.. ఈ ప్రయాణాలు చేసే సమయంలో మనకి ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉంది అంటే అది మన మొబైల్ మాత్రమే. చాల మంది ప్రయాణాలు చేసే సమయంలో సినిమాలు చూడడానికో, లేకపోతే పాటలు వినడానికో ఇష్టపడుతూ ఉంటారు.

Video Advertisement

battery down 1

అందుకే జర్నీ ఉందంటే చాలు ముందు మనం మన మొబైల్ ను ఛార్జ్ చేస్తాం. బ్యాటరీ ఫుల్ అయ్యాకే బయలుదేరుతాం. అయితే.. మనకి ఫోన్ అవసరం ఉందని ముందే తెలుస్తుందో ఏమో బ్యాటరీ ఫాస్ట్ గా డౌన్ అయిపోతూ ఉంటుంది. మీరెప్పుడైనా గమనించారా? నార్మల్ డేస్ లో మీకు రోజంతా స్టాండ్ బై వచ్చిన బ్యాటరీ జర్నీ డేస్ లో మాత్రం రాదు.

battery down 3

మీరు నాలుగైదు గంటల జర్నీ లో మొబైల్ వాడుతూ ఉండడం వల్ల అయిపొయింది ఏమో అని అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. నిజానికి, జర్నీలో ఉన్న సమయంలో సిగ్నల్స్ పోతూ ఉంటాయి. జర్నీ చేస్తున్నపుడు మనం ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కు మూవ్ అవుతూనే ఉంటాం. అంటే.. ఒక సెల్ టవర్ నుంచి మరో సెల్ టవర్ వైపుకు మనతో పాటు మన మొబైల్ కూడా మూవ్ అవుతుంది.

battery down 2

ఈ క్రమంలో మన మొబైల్ సిగ్నల్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒక టవర్ కి కనెక్ట్ అవగానే.. మనం ఆ ప్లేస్ నుంచి మూవ్ అయిపోవడం వలన మరో సెల్ టవర్ కోసం ఫోన్ సెర్చ్ చేస్తుంది. ముఖ్యంగా లో సిగ్నల్ జోన్ లో ఉన్న సమయంలో మొబైల్ ట్రాన్స్మిటర్ పవర్ ను ఎక్కువ చేస్తుంది. దీనివల్ల బ్యాటరీ తొందరగా డ్రైన్ అయిపోతుంది. అదన్నమాట అసలు సంగతి.


End of Article

You may also like