పొరపాటున మీ డబ్బుని మరొకరి ఖాతాలో వేసారా? అయితే వెంటనే ఈ పని చేసేయండి..! ఆర్బీఐ ఏమి చెబుతోందంటే?

పొరపాటున మీ డబ్బుని మరొకరి ఖాతాలో వేసారా? అయితే వెంటనే ఈ పని చేసేయండి..! ఆర్బీఐ ఏమి చెబుతోందంటే?

by Anudeep

Ads

ఒకప్పుడు బ్యాంకు ట్రాన్సాక్షన్ అంటే చాలా కష్టమైన పని. డబ్బు లెక్కకట్టుకోవాలి.. క్యూ లో నుంచోవాలి.. ఫారం ను ఫిలప్ చేసుకుని కౌంటర్ లో ఇచ్చి.. డబ్బు జమ అయ్యేవరకు వేచి ఉండాలి. అలాగే.. మనకు ఇచ్చిన ఫారం లో ఖాతా నంబర్లను కూడా సరిగ్గా వేసుకోవాలి. ప్రస్తుతం ఆన్ లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లు అందుబాటులోకి వచ్చిన తరువాత మన పని సులభతరం అయింది.

Video Advertisement

sent money to the wrong account

నిమిషాల్లో డబ్బుని ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు పంపేస్తున్నాం. అయితే, మొబైల్ బ్యాంకింగ్ లో కూడా ఎక్కువగా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. మొబైల్ బ్యాంకింగ్ లో మనం ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా సంబంధిత వ్యక్తి ఖాతాకు అమౌంట్ పంపిస్తాము. మన ఫోన్ లో సేవ్ అయి ఉన్న కాంటాక్ట్ విషయంలో పొరపాట్లు జరగకపోయినా.. కొత్త నెంబర్ ను ఎంటర్ చేసి, కొత్త వ్యక్తులకు నగదు బదిలీ చేసే సమయంలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది.

sent money to the wrong account

ఇలా పొరపాటున మీకు తెలియని వ్యక్తులకు నగదు పంపేసినపుడు.. వెంటనే మీ బ్యాంకు కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి జరిగినదంతా తెలియచెప్పండి. వారు అడిగిన జి-మెయిల్ ఐడికి మీ ట్రాన్సాక్షన్ తాలూకు వివరాలను పంపించాల్సి ఉంటుంది. అయితే.. మీ ఖాతా పేరు, నెంబర్ వివరాలతో పాటు మీ ఏ ఖాతా నెంబర్ కి డబ్బు పంపించారో ఆ వివరాలు తెలియపరచాలి. ఒకవేళ మీరు ఏదైనా తప్పు నెంబర్ ఉన్న ఖాతా కి గాని, తప్పు IFSC కోడ్ ఉన్న ఖాతాకి గాని డబ్బు పంపించి ఉంటె.. ఆ డబ్బు వెంటనే మీ ఖాతా లో జమ అయిపోతుంది.

sent money to the wrong account

ఒకవేళ అవకపోతే మీరు బ్యాంకు మేనేజర్ ని కలవడం మంచిది. ఒకవేళ మీ బ్యాంకుకే చెందిన మరొకరి ఖాతాకి డబ్బుని బదిలీ చేసి ఉంటె.. బ్యాంకుని సంప్రదించిన తరువాత కొద్దిసేపటికే.. మీ డబ్బు మీ ఖాతాలోకి చేరుతుంది. ఒకవేళ వేరే బ్యాంకుకు చెందిన ఖాతాకు డబ్బు జమ అయి ఉంటె.. తిరిగి మీ డబ్బు మీ ఖాతా లోకి రావడానికి సమయం పట్టచ్చు. ఎందుకంటే మీ బ్యాంకు.. ఇతర బ్యాంకుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈ ప్రక్రియ పూర్తి కావడానికి రెండు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంటుంది.

sent money to the wrong account

మీరు ఏ ఖాతాకి అయితే డబ్బు పంపారో.. సదరు వ్యక్తిని బ్యాంకు సంప్రదిస్తుంది. ఆ డబ్బుని తిరిగి పంపాలని సూచిస్తుంది. ఒకవేళ ఈ విషయంలో బ్యాంకులు పట్టించుకోకపోయినా.. మీ డబ్బు తిరిగి మీ ఖాతాలోకి రాకపోయినా.. మీరు ఈ విషయమై కోర్ట్ ను ఆశ్రయించవచ్చు. ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించాలని ఆర్బీఐ ఇప్పటికే అన్ని బ్యాంకులను ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా డబ్బుని తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే.. వారి ప్రవర్తనను రిజర్వ్ బ్యాంకు చట్టాల ఉల్లంఘన కింద పేర్కొంటారు. తప్పు ఖాతాకు డబ్బు జమ అయితే.. ఈ డబ్బుని సరి అయిన ఖాతాకు పంపించాల్సిన బాధ్యత బ్యాంకుదేనని ఆర్బీఐ స్పష్టం చేసింది.


End of Article

You may also like