Ads
భార్య భర్తల బంధం పెళ్లి తోనే మొదలవుతుంది. ముందే పరిచయాలు ఉన్నా.. లేక పెళ్లి తోనే పరిచయం అయినా.. పరిచయం ఎలా జరిగినా.. ఒకసారి భార్య భర్తలు అయ్యాక వారు జీవితాంతం కలిసే ఉండాలి. అలాంటప్పుడు.. ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదని.. ఏ విషయమైనా పంచుకునే స్వేచ్ఛ ఉండాలని కోరుకోవడం సహజమే.
Video Advertisement
కానీ, మనం నమ్మి వెళ్లిన జీవిత భాగస్వామి మనకు నిజాలు చెప్పకుండా దాస్తున్నారని మనకి తెలిసినపుడు బాధ కలుగుతుంది. ఇలాంటి పరిస్థితే ఓ అమ్మాయికి ఎదురైంది. తన బాధ ను చెప్పుకుంటూ ఓ లేఖ రాసింది. తన సమస్యకు పరిష్కారం చెప్పాలని కోరుతోంది. ఇంతకు ఆమె ఏమి చెప్పిందంటే.. ” ఎన్నో ఆశలతో.. వివాహ బంధం తో తన భర్త జీవితం లోకి అడుగు పెట్టాను. పెళ్లి కుదిరినప్పటి నుంచే ఆయన ముభావం గా ఉండడం నన్ను ఇబ్బంది పెట్టేది. ఏదైనా మాట్లాడితే.. నవ్వుతూనే సమాధానం ఇచ్చేవారు దీనితో పెళ్లి ఇష్టం లేదేమో అన్న అనుమానం నాకు రాలేదు.
పెద్ద గా మాట్లాడకపోవడం, ఎక్కువ సేపు ఫోన్ చూస్తూ సైలెంట్ గా ఉండిపోవడం వంటివి చూసినప్పుడల్లా.. బిడియం, లేదా మొహమాట పడుతున్నారని అనుకునేదాన్ని. పెళ్లి అయ్యిన తరువాత కూడా తనలో ఏ మార్పు లేదు. ఆరు నెలలు అవుతున్నా.. తనలో అదే నిశ్శబ్దం నన్ను దహించేస్తోంది. కారణమేంటో నాకు అంతుపట్టలేదు. ఆ తరువాత నాకు తెలిసింది ఏంటంటే.. తనకు గతం లోనే ఓ అమ్మాయితో సంబంధం ఉంది.
ఎనిమిదేళ్లు గా ఓ అమ్మాయిని అతను ప్రేమిస్తున్నారు. కొంత కాలం సహజీవనం కూడా చేసారు. ఇంత జరిగాక ఆమె ఏమైంది..? అన్న విషయం మాత్రం నాకు తెలియదు. మా వారికి తెలిసిన వ్యక్తి ద్వారా ఈ విషయం తెలుసుకున్నాను. తెలియగానే బాధ, జాలి ఒకే సారి కలుగుతున్నాయి. ఈ విషయం గురించి తనని నేను అడగాలా..? వద్దా? అన్న సందేహం లో ఉన్నాను. అడిగితే, తను ఎలా రియాక్ట్ అవుతారో..? ఇష్టం లేని ఈ బంధాన్ని కొనసాగించాలా? వద్దా? అనేది తేల్చుకోలేకపోతున్నాను. నాకు సరైన సలహా ఇవ్వగలరు.
End of Article