ఆరేళ్ల కొడుకు కోసం టైంటేబుల్ సిద్ధం చేసిన తల్లి..! లాస్ట్ లో కండిషన్స్ హైలైట్.!

ఆరేళ్ల కొడుకు కోసం టైంటేబుల్ సిద్ధం చేసిన తల్లి..! లాస్ట్ లో కండిషన్స్ హైలైట్.!

by Mohana Priya

Ads

టైం టేబుల్ అనే పదం ప్రతి విద్యార్థికీ పరిచయమే.. చిన్నతంలో మన స్కూల్లో టైం టేబుల్ ప్రకారం అన్ని సబ్జెక్ట్లు  నేర్పిస్తూ ఉండేవారు. టైం టేబుల్ ఫాలో అవుతూ టీచర్స్ మనకు క్రమశిక్షణ అలవాటు చేస్తుంటారు . అలాగే మనం కొంచెం పెద్దయిన తర్వాత కూడా ఏ పని ఏ విధంగా చేయాలని ఓ టైం టేబుల్ నిర్ణయించుకుని ఉంటాం.

Video Advertisement

అయితే అసలు విషయానికి వస్తే  కేవలం ఆరు సంవత్సరాలు తన కొడుకు కోసం ఒక టైం టేబుల్ సిద్ధం చేసింది ఓ మాతృమూర్తి . ఈ టైం టేబుల్ ఇప్పుడు సోషల్ మీడియాల పుణ్యమా అని  వైరల్ గా మారి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది.

ఆ తల్లి ఈ టైం టేబుల్ ని ఎలా సెట్ చేసిందంటే ఉదయం 7:50 అలారం సమయమని రాసింది. బెడ్ పై నుంచి ఎనిమిది గంటలకు లేవాలి. అదేవిధంగా ఏ టైం కి బ్రష్ చేయాలి, ఏ టైం కి బ్రేక్ ఫాస్ట్ చేయాలి, ఈ టైంకి ఆడుకోవాలి, ఈ టైంకి చదువుకోవాలి, ఈ టైం కి క్లీనింగ్ చేయాలంటూ అంటూ నిద్రపోయే వరకు టైం టేబుల్ సెట్ చేసేసింది.

టైం టేబుల్ ఫాలో అవడానికి రూల్స్ కూడా ఉన్నాయండోయ్. ఈ టైం టేబుల్ ఫాలో అయ్యే సమయంలో ఏడవకూడదు, గట్టిగా కేకలు పెట్టకూడదు, పోట్లాడకూడదు  అనే రూల్స్ కూడా ఉన్నాయి ఈ టైం టేబుల్ లో.

Also Read: విడాకుల రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర, శ్రవణ భార్గవి..! ఇది మంచి విషయమే అంటూ..?

అంతేకాదండోయ్ పిల్లవాడు ఖచ్చితంగా టైం టేబుల్  ఫాలో అయిపోతే రోజుకు పది రూపాయలు ప్రైస్ మనీ ఇస్తారంట. వారం రోజులు ఫాలో అయిపోతే వంద రూపాయల ప్రైజ్ మనీ అంటూ కొడుకు కోసం  టైం టేబుల్ సెట్ చేసింది ఆ తల్లి. ఈ టైం టేబుల్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్చల్ చేస్తుంది. నెటిజెన్లు సైతం ఈమె టైం టేబుల్ రూల్స్ ఫిదా అయిపోయారు. ఏమి క్రమశిక్షణలో పెట్టావు తల్లి కొడుకు ను అంటూ కామెంట్ చేస్తున్నారు.

Also Read: హెల్మెట్ మ్యాన్: రెడ్ సిగ్నల్ పడగానే ఇతను డాన్స్ ఎందుకు చేస్తాడో తెలుసా.?


End of Article

You may also like