“టీచర్” కే పాఠం నేర్పిన విద్యార్థి..! వైరల్ అవుతున్న ఓ మెసేజ్..!

“టీచర్” కే పాఠం నేర్పిన విద్యార్థి..! వైరల్ అవుతున్న ఓ మెసేజ్..!

by Anudeep

Ads

మనం తర్వాత అత్యంత పూజ్యానీయంగా భావించే వ్యక్తి గురువు. ‘ఆచార్యదేవోభవ’ అంటూ విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గౌరవిస్తాం.. మన తల్లిదండ్రుల కంటే గురువులకే మన గురించి ఎక్కువ తెలుసనడంలో ఎలాంటి సందేహం లేదు.

Video Advertisement

మన తెలివితేటలు, ఆలోచనల గురించి వారికి పూర్తిగా తెలుసు. ‘నీకు ఈ సబ్జెక్టుపై మంచి పట్టుంది. నువ్వు ఫలానా కోర్సు చెయ్యి నీ భవిష్యత్తు బాగుంటుంది’ అని వారే మనకు సూచిస్తుంటారు. అందుకే గురువును మించిన దైవం లేదని అంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే మనల్ని అత్యున్నత స్థానంలో చూడాలని ఉపాధ్యాయుడు కోరుకుంటారు.

తన శిష్యుడు సాధించిన విజయాన్ని తన విజయంగా భావించి గర్వంతో ఉప్పొంగిపోతారు. అయితే ఇప్పుడు ఓ స్టూడెంట్ టీచర్ కు పెట్టిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ” హలో మేడమ్ నేను 10వ తరగతి 2019-2020 బ్యాచ్‌ విద్యార్థుల్లో ఒకడిని, ఈ మెసేజ్ మీకు ఎందుకు పంపుతున్నాను అంటే.. నేను ఏం సాధించలేని, పాస్ అవ్వలేను అంటూ మీరు నాకు చెప్పారు. మీరు నన్ను సాధ్యమైనంత వరకు దిగజార్చారు.

ఈ రోజు నేను 12వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. అలాగే నేను ఎప్పటి నుంచో కోరుకునే విశ్వవిద్యాలయంలో చేరాను. నేను చదవాలనుకున్న కోర్సును కూడా చేస్తున్నాను. ఇది మీకు పంపే కృతజ్ఞతా సందేశం కాదు కానీ నెక్స్ట్ నేను ఇలా చేశానని మీకు తెలియాడానికి చెప్తున్నాను. దయచేసి వ్యక్తుల పట్ల ముఖ్యంగా మీ సహాయం కోరే విద్యార్థుల పట్ల దయతో ఉండాలని గుర్తుంచుకోండి అంటూ ఓ విద్యార్థి తన టీచర్ మెసేజ్ పంపాడు.

దీనిపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక “ఆశా మేడమ్” విద్యార్థి నుండి ఓ పాఠం నేర్చుకుంది అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. విద్యార్థులందరూ అన్ని సబ్జెక్టుల్లో రాణించరు. విద్యార్థులందరూ ఇంజనీర్లు, డాక్టర్లు కావాల్సిన అవసరం లేదు. గొప్ప మార్కులు సాధించిన విద్యార్థులందరూ గొప్పవారు కారు. కానీ విద్యార్థులందరూ గొప్పతనాన్ని సాధించగల సామర్థ్యం కలిగి ఉంటారు. ఉపాధ్యాయులు తమలో దానిని ఎనేబుల్ చేసుకోవాలి అని మరికొందరంటున్నారు .


End of Article

You may also like