ఈ ఊళ్ళో ఇల్లు కేవలం 90 రూపాయలే.. కప్పు కాఫీ కంటే తక్కువ కదా.. ఎక్కడో చూడండి..!

ఈ ఊళ్ళో ఇల్లు కేవలం 90 రూపాయలే.. కప్పు కాఫీ కంటే తక్కువ కదా.. ఎక్కడో చూడండి..!

by Anudeep

Ads

ఇల్లు ఒక యూరో కి అమ్మేస్తారట. ఎక్కడో తెలుసా.. ఇటలీ లో. అక్కడ ఒక యూరో కి కాఫీ కూడా రాదు. ఇంతకీ, ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక యూరో అంటే 90 రూపాయలు. కేవలం 90 రూపాయలకు కూడా ఇల్లు అమ్మేసారట. ఇటలీ లో కాస్టిగ్లియోన్ డి సిసిలియా వద్ద సిసిలియన్ పట్టణం లో ఇటువంటి ఇళ్లను అమ్ముతున్నారట. ఇంతకీ ఆ కథ ఏంటో చూద్దాం రండి.

Video Advertisement

italy 1

ఒక ఇల్లు కట్టుకోవడమే చాలా కష్టమైపోయింది ఈ రోజుల్లో.. అలాంటిది.. అంత తక్కువ ప్రైస్ కే ఇల్లును అమ్మడం అనేది కొంత ఆశ్చర్యపడే విషయమే. కానీ.. ఇది ఇటలీ లో మొదటిసారేమి కాదు. సలేమి, బిసక్సియా వంటి ప్రాంతాల్లో గతం లో కూడా తక్కువ ధరకే ఇల్లు అమ్మినవారున్నారు. కాస్టిగ్లియోన్ డి సిసిలియా ఎట్నా పర్వతం యొక్క వాలుపై ఉంది మరియు సిసిలీ యొక్క అద్భుతమైన బీచ్ లకు చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రదేశం మనుషులు జీవించడానికి ఎంతో అనువైన ప్రాంతం.

italy 2

ఆ ప్రాంతం లో సుమారు గా 900 ఇళ్ళు ఖాళి గా ఉన్నాయి. ఈ ఇళ్లలో దాదాపు సగం శిధిలమైన స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటిని 1 యూరోల సింబాలిక్ ధరకు అమ్ముతారు, ఇది సుమారు రూ. ఇండియన్ కరెన్సీలో 90 ఉండగా, మిగిలిన ఇళ్ల ధర 4 కే నుంచి 5 కె యూరోల మధ్య ఉంటుంది. అంటే, 3.5 లక్షల రూ. భారత కరెన్సీలో 4.5 లక్షల రూపాయలు ఖరీదు చేస్తాయి. చాల వరకు ఇళ్లకు మరమ్మత్తులు చేయాల్సి ఉంది.

italy 3

అయితే.. ఆ ఇళ్లను కొనుక్కున్న కొత్త యజమానులు మూడేళ్ళలోపు ఆ ఇంటికి అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేసుకోవాలన్న షరతు పై తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఈ ప్రాంతానికి చరిత్ర ఉంది. అయితే.. ఈ ప్రాంత పురాతన నిర్మాణ వారసత్వాన్ని కాపాడాలంటూ ఆ నగర మేయర్ ఆంటోనినో కమర్డా పేర్కొన్నారు.

 


End of Article

You may also like