చాణుక్యుని గురించి తెలియని వారు ఉండరు. సామాజిక జీవితం లో మనిషి మనుగడ సాగించడానికి ఆయన చెప్పిన నీతి వాక్యాలు ఎంతగానో అవసరం అవుతాయి. జీవితం లో ఒక్కసారి అయినా ఆయన ఏమి చెప్పారో అన్న విషయాన్నీ గుర్తు చేసుకోకుండా మనం ఉండలేము. అలాగే.. ఆయన భార్యల గురించి ఏమి చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

chanakya

ముఖాన్ని చూసి ఎప్పుడు భార్యగా వచ్చే అమ్మాయిని ఎంచుకోకూడదు అని చాణక్యుడు స్పష్టం చేసారు. భార్య గా తెచ్చుకునే అమ్మాయి మనసు, అంతఃసౌందర్యాన్ని చూడాలి తప్ప శరీరాన్ని కాదని చెప్పాడు. సంప్రదాయాలను పాటిస్తూ.. వారసులను అందించే స్త్రీని భార్య గా ఎంచుకోవాలని చాణుక్యుడు హితవు చెప్పాడు. అలాగే.. భార్య గా ఎంచుకునే అమ్మాయికి ఓపిక ఉందా లేదా అన్న విషయాన్నీ కూడా పరిశీలించాలని చెప్పారు. అలాగే.. స్త్రీలకు కోపం ఎక్కువ గా ఉంటె.. ఆ కుటుంబ జీవితమే నాశనమవుతుంది. అందుకే భార్య గా ఎంచుకునే అమ్మాయి కోపం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలని చాణుక్యుడు సూచించాడు.