అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2 చిత్రం ఎంత హిట్ అయ్యిందో మనకి తెలిసిందే. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ క్రిమికే థ్రిల్లర్ ని హిట్ ఫ్రాంచైజీ లో భాగం గా తీశారు. ఈ చిత్రం డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకి వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.

Video Advertisement

 

 

అయితే అమెజాన్ ప్రైమ్ ఇటీవల అభిమానులకు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే సినిమా విడుదలై నెలరోజులు పూర్తికాగా.. రూ. 129 రెంటల్ బేసిస్‌పై మంగళవారం నుంచి యూజర్లు ప్రైమ్ వీడియోలో ఈ సినిమా చూడవచ్చనే న్యూస్ వెలువడింది. అదే టైమ్‌లో యాప్ సబ్‌స్రైబర్స్‌కు జనవరి 6 నుంచి స్ట్రీమ్ అవుతుందనే న్యూస్ కూడా వినిపించింది. కానీ ‘హిట్ : ది సెకండ్ కేస్’ ప్రస్తుతం రెంటల్ బేస్‌లో కూడా స్ట్రీమింగ్‌‌కు అందుబాటులో లేదు.

adivi sesh hit 2 movie isstreaming in amazon prime..!!

 

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘హిట్ 2’ మూవీని ఎటువంటి ముందస్తు అప్‌డేట్ లేకుండా ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్ దాని కేటలాగ్ నుంచి ఈ టైటిల్‌ను తీసివేసింది. దీంతో నేరుగా జనవరి 6, 2023 నుంచి సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అప్పుడు రెంటల్ బేస్ కాకుండా సబ్‌స్క్రైబర్లకు నేరుగా సినిమా వీక్షించే అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు.

adivi sesh hit 2 movie isstreaming in amazon prime..!!

మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన చిత్రంలో కలర్ ఫొటో ఫేమ్ సుహాస్, రావు రమేష్, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, హర్ష వర్ధన్, కోమలీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీలో వరుస సినిమాలు వస్తూనే ఉంటాయని ప్రకటించిన విషయం తెలిసిందే. తదుపరి సినిమాలో ఈ నాని హీరోగా నటించనున్నట్లు హిట్ 2 చిత్రం లోనే రివీల్ చేసారు.

adivi sesh hit 2 movie isstreaming in amazon prime..!!

మూడేళ్ల క్రితం విశ్వక్ సేన్ హీరోగా ‘హిట్: ది ఫస్ట్ కేసు’ మూవీ వచ్చింది. ఈ సినిమాకి కూడా శైలేష్ కొలను దర్శకుడు. అలానే నాని ఈ సినిమాని సమర్పించగా.. అతని సోదరి ప్రశాంతి త్రిపురనేని ఈ మూవీని నిర్మించారు. దాంతో మరోసారి అదే కాంబినేషన్‌లో హిట్-2 మూవీ కూడా వచ్చింది. ఈ ఏడాది హిట్-3 రాబోతున్నట్లు దర్శకుడు సంకేతాలిచ్చాడు.