పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకుంటున్నారా.? అయితే ఇది ఒకసారి చూడండి.!

పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకుంటున్నారా.? అయితే ఇది ఒకసారి చూడండి.!

by Megha Varna

Ads

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. పెళ్లితో రెండు కుటుంబాలు, రెండు మనసులు కూడా ఏకమవుతాయి. అయితే ఆడపిల్లలకి పెళ్ళికి ముందు ఒకే ఇంటి పేరు ఉంటే.. పెళ్లి తర్వాత మరొక ఇంటి పేరు ఉంటుంది. పెళ్లికి ముందు తండ్రి ఇంటి పేరుని ఆడపిల్లలు ఉపయోగించడం జరుగుతుంది.

Video Advertisement

ఆ తర్వాత అత్తింటి వారి యొక్క ఇంటి పేరుని ఆడపిల్లలు మార్చుకోవాల్సి ఉంటుంది. వివాహం తర్వాత ఇంటి పేరు మార్చుకోవడం వల్ల కలిగే లాభ నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లి తర్వాత ఆడపిల్ల తన ఇంటి పేరును తొలగించి తన భర్త యొక్క ఇంటి పేరు యాడ్ చేసుకున్నప్పుడు ఆ ఇంటి సభ్యురాలు అవుతుంది. ఆమె భర్త ఇంటి పేరుని మార్చుకున్నప్పుడే వివాహం అయిందని కుటుంబం భావిస్తుంది. అలానే సమాజం కూడా భావిస్తోంది.

అదే ఒకవేళ కనుక మీరు పెళ్లి తర్వాత మీ భర్త పేరు ఇంటి పేరుగా మార్చుకోకపోతే మీ ఇంట్లో ఏదో సమస్య వచ్చిందని కొందరు అనుకుంటూ ఉంటారు. అలానే భర్త పేరు తో మీ పేరు ఉంటే ఆస్తి పత్రాలను సిద్ధం చేసేటప్పుడు ఇబ్బందులు కలగవు. అలానే జాయింట్ అకౌంట్ లాంటివి తెరవడానికి కూడా సులభంగా ఉంటుంది.

కానీ ఆడ పిల్లలు కుటుంబ సంప్రదాయ పేరు లేదా తండ్రి పేరును గర్వంగా ఉపయోగించడాన్ని పెళ్లి తర్వాత కోల్పోతారు. పైగా పుట్టింటి వాళ్ళ పేరుతోనే ఉంచడం భర్తకు ఇష్టం ఉండదు. ఇలా ఆడ పిల్లలు వివాహం తర్వాత ఇంటి పేరు మార్చుకుంటే ఈ లాభాలు, నష్టాలు ఉంటాయి.

Note: All the images used in this article are just for reference purpose only, but not the actual characters.


End of Article

You may also like